జంతువుల నుంచి కూడా కరోనా?: ఫ్రెంచ్‌ శాస్త్రవేత్తలు

ABN , First Publish Date - 2020-03-26T08:13:14+05:30 IST

జంతువుల నుంచి కరోనా వైరస్‌ వ్యాపించదని కచ్చితంగా చెప్పలేమని ఫ్రెంచ్‌ అకాడమీ ఆఫ్‌ మెడిసిన్‌ వెల్లడించింది. పెంపుడు కుక్కలు, పిల్లులను తాకిన తర్వాత చేతులను శుభ్రంగా

జంతువుల నుంచి కూడా కరోనా?: ఫ్రెంచ్‌ శాస్త్రవేత్తలు

ప్యారిస్‌, మార్చి 25 : జంతువుల నుంచి కరోనా వైరస్‌ వ్యాపించదని కచ్చితంగా చెప్పలేమని ఫ్రెంచ్‌ అకాడమీ ఆఫ్‌ మెడిసిన్‌ వెల్లడించింది. పెంపుడు కుక్కలు, పిల్లులను తాకిన తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోవడం వంటి కనీస జాగ్రత్తలు తీసుకోకుంటే వ్యాధుల ముప్పు పొంచి ఉంటుందని హెచ్చరించింది. హాంకాంగ్‌లో పెంపుడు కుక్కల నుంచి ఓ వ్యక్తికి కరోనా వచ్చిన వైనాన్ని ఇందుకు ఉదాహరణగా చూపింది. కాగా, సదరు బాధితుడు పెంచిన రెండు కుక్కల్లో ఒకదానికి కరోనా సోకలేదని తేలగా, మరో దానికి వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు.

Updated Date - 2020-03-26T08:13:14+05:30 IST