-
-
Home » Prathyekam » airasia corona suspect new delhi
-
విమానంలో కరోనా అనుమానితుడు! కంగారులో పైలట్ ఏం చేసాడో తెలిస్తే..
ABN , First Publish Date - 2020-03-23T20:43:53+05:30 IST
శుక్రవారం నాడు ఎయిర్ ఎసియా విమానంలో ఆశ్చర్యకరమైన ఘటన చోటుచేసుకుంది.

న్యూఢిల్లీ: శుక్రవారం నాడు ఎయిర్ ఏసియా విమానంలో ఆశ్చర్యకరమైన ఘటన చోటుచేసుకుంది. పుణె నుంచి ఢిల్లీ వెళుతున్న విమానంలో కరోనా అనుమానితుడు ఉన్నాడని పైలట్‌కు సమాచారం అందటంతో అతడు అప్రమత్తమయ్యాడు. ఢిల్లీ విమానశ్రయంలో విమానం ల్యాండ్ అయిన అనంతరం.. అతడు కాక్‌పిట్ కిటికీ నుంచి కిందకు దిగాడు. సాధారణంగా అందరూ ఉపయోగించే ఎగ్జిట్‌ను అతడు వినియోగించేందుకు సాహసించలేదు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. కాగా.. ఈ ఘటనపై ఎయిర్ ఏసియా అధికారులు స్పందించారు. ‘ప్రధాన ఎగ్జిట్ మార్గం వద్ద అంతా సవ్యంగా ఉందని నిర్ధారించే వరకూ మా సిబ్బంది తమని తాము క్వారంటైన్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే పైలట్ కాక్‌పిట్ నుంచి కిందకు దిగేందుకు నిర్ణయించారు. అయితే మా సిబ్బంది పూర్తి స్థాయిలో సుశిక్షన పొందారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎలా స్పందించాలనే దానిపై వారికి పూర్తి అవగాహన ఉంటుంది. క్లిష్ట సమయంలోనూ తమ నిబద్ధత చాటుకుంటున్న వారు ప్రశంసాపాత్రులు’ అని ఓ అధికారి వ్యాఖ్యానించారు.