ప్రమాద వశాత్తూ కారులో ఇరుక్కుపోయిన చిన్నారులు.. ఊపిరాడక ఇద్దరు మృతి

ABN , First Publish Date - 2020-06-16T22:03:13+05:30 IST

ప్రమాద వశాత్తూ కారులో చిక్కుకుని ఇద్దరు చిన్నారులు మృతిచెందిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే....

ప్రమాద వశాత్తూ కారులో ఇరుక్కుపోయిన చిన్నారులు.. ఊపిరాడక ఇద్దరు మృతి

లక్నో: ప్రమాద వశాత్తూ కారులో చిక్కుకుని ఇద్దరు చిన్నారులు మృతిచెందిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నలుగురు చిన్నారులు ఆడుకుంటూ కారులోకి ఎక్కారు. అయితే వారు ఎక్కిన తరువాత కారు లాక్ అయిపోవడంతో అందరూ లోపల ఇరుక్కుపోయారు. కారు అద్దాలు కూడా మూసుకుపోయి ఉండడంతో వారు లోపలే ఇరుక్కుపోయారు. ఎంతసేపటికీ పిల్లలు తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన వారి తల్లిదండ్రులు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెదకడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో చిన్నారులు కారులో ఇరుక్కుపోయినట్లు గుర్తించారు. వెంటనే వారిని బయటకు తీశారు. అయితే ఊపిరి ఆడకపోవడంతో వారిలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా మిగిలిన ఇద్దరు అపస్మారక స్థితికి చేరుకున్నారు. వీరిని హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు.


Updated Date - 2020-06-16T22:03:13+05:30 IST