థియేటర్‌లో బొమ్మ పడాలా..? వద్దా..? మీరే చెప్పండి..

ABN , First Publish Date - 2020-10-14T02:10:15+05:30 IST

భారత్‌లో కరోనా నేపథ్యంలో కేంద్రం విధించిన లాక్‌డౌన్ ప్రక్రియ దాదాపుగా ముగిసింది. అన్‌లాక్ మార్గదర్శకాల పేరుతో..

థియేటర్‌లో బొమ్మ పడాలా..? వద్దా..? మీరే చెప్పండి..

భారత్‌లో కరోనా నేపథ్యంలో కేంద్రం విధించిన లాక్‌డౌన్ ప్రక్రియ దాదాపుగా ముగిసింది. అన్‌లాక్ మార్గదర్శకాల పేరుతో కేంద్రం ప్రతీ నెల మరిన్ని సడలింపులను ప్రకటిస్తూ వస్తోంది. నగరాల్లో, పట్టణాల్లో జన సమర్థం ఎక్కువగా ఉండే షాపింగ్ మాల్స్ కోవిడ్-19 నిబంధనలను పాటిస్తూ ఇప్పటికే తెరుచుకోగా.. సినిమా థియేటర్లు కూడా కొత్త సినిమా విడుదలైనట్టుగా సరికొత్తగా ముస్తాబవుతున్నాయి. అక్టోబర్ 15 నుంచి సినిమా థియేటర్లు 50 శాతం సీట్ ఆక్యుపెన్సీతో తెరిచేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.


అయితే.. సినిమా థియేటర్లు తెరిస్తే.. కొత్త సినిమాలు విడుదల చేస్తే ప్రేక్షకులు గతంలో మాదిరిగానే సినిమాలకు వస్తారా లేక కరోనా భయంతో ఓటీటీలే మేలని ఇంట్లోనే కూర్చుని వినోదాన్ని ఆస్వాదిస్తారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సినిమా థియేటర్లలో ప్రస్తుతం పరిమిత సంఖ్యలోనే ప్రేక్షకులకు అనుమతి ఉంటుంది. ఆ పరిమిత సంఖ్యలో కూడా ప్రేక్షకులు థియేటర్లకు సినిమాలు చూసేందుకు వెళ్లకపోతే థియేటర్ల యాజమాన్యాలు నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితి. సినిమా థియేటర్లు తెరిస్తే పరిణామాలు ఎలా ఉండబోతున్నాయనే ప్రశ్నకు సందేహాలు, అనుమానాలు తప్ప సమాధానం దొరికే పరిస్థితి కనిపించడం లేదు.


ఈ నేపథ్యంలో.. ఈ అంశంపై మీ అభిప్రాయానికి ఏబీఎన్-ఆంధ్రజ్యోతి వేదికగా నిలవనుంది. సినిమా థియేటర్లు తెరవడం సమంజసమేనా, కాదా.. థియేటర్లు తెరిస్తే ప్రేక్షకులు గతంలో మాదిరిగానే సినిమాలను ఆదరిస్తారా.. కరోనా భయంతో థియేటర్ల వంక కన్నెత్తి కూడా చూడరా.. ఇలాంటి ఎన్నో సందేహాలపై మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. మీ అభిప్రాయానికి బాధ్యత కలిగిన మీడియాగా మేం అద్దం పడతాం. అందుకు మీరు చేయాల్సిందల్లా ఒకటే.. మేం మీ ముందు ఉంచుతున్న ఈ ప్రశ్నలకు కొద్దిసేపు సమయాన్ని కేటాయించి అవునా, కాదా అని సమాధానం ఇవ్వడమే. ఇంకెందుకు ఆలస్యం. మీ విలువైన అభిప్రాయాన్ని మాతో పంచుకోండి. ఈ కింది లింక్‌‌పై క్లిక్ చేసి మీ అభిప్రాయాన్ని వ్యక్తపరచండి.


థియేటర్‌లో బొమ్మ పడాలా..? వద్దా..?

Updated Date - 2020-10-14T02:10:15+05:30 IST