ఒంటరి దీవి దిశగా దూసుకెళ్తున్న మంచు కొండ!

ABN , First Publish Date - 2020-12-29T07:22:27+05:30 IST

ప్రపంచంలోనే అత్యంత భారీ సైజులో ఉన్న ఓ మంచు కొండ.. ఓ ఒంటరి దీవివైపు దూసుకెళ్తోంది. ఆ దీవిని మరికొన్ని రోజుల్లో ఈ మంచు కొండ ఢీ కొట్టనుందని పరిశోధకులు చెప్తున్నారు.

ఒంటరి దీవి దిశగా దూసుకెళ్తున్న మంచు కొండ!

లండన్: ప్రపంచంలోనే అత్యంత భారీ సైజులో ఉన్న ఓ మంచు కొండ.. ఓ ఒంటరి దీవివైపు దూసుకెళ్తోంది. ఆ దీవిని మరికొన్ని రోజుల్లో ఈ మంచు కొండ ఢీ కొట్టనుందని పరిశోధకులు చెప్తున్నారు. అదే ఏ68ఏ. అంటార్కిటికా మంచు ఖండం నుంచి 2017లో ఏ68 అనే భారీ మంచు ముక్క విరిగిపోయింది. ఆ తర్వాత పసిఫిక్ మహాసముద్రంలోని నీటిలో తేలియాడుతూ ఉన్న ఈ మంచు ముక్క.. రెండు ముక్కలుగా విడిపోయింది. వీటిలో పెద్ద దాన్ని ఏ68ఏ అని పిలుస్తున్నారు. ఇది ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలో బ్రిటన్‌కు చెందిన సౌత్ జార్జియా ద్వీపం వైపు దూసుకెళ్తోంది. ఈ మంచు కొండ గనుకు ఈ దీవిని ఢీ కొడితే.. దీవిలోని పర్యావరణం, జంతువులు చాలా ఇంబ్బందులకు గురవుతాయి. జనాభా అరుదుగా ఉండే ఈ దీవి చాలా భాగం మంచుతోనే కప్పబడి ఉంటుంది. ఇక్కడ పెంగ్విన్లు, సీ లయన్స్ వంటి జీవులు ఎక్కువగా ఉంటాయి. ఏ68ఏ గనుక దీవిని ఢీకొడితే.. పెంగ్విన్లు తమ సంతానానికి ఆహారం సంపాదించుకోవడం కూడా కష్టం అవుతుందని పరిశోధకులు అంటున్నారు.

Updated Date - 2020-12-29T07:22:27+05:30 IST