డబ్బే డబ్బు! 9 ఏళ్ల వయసులోనే రూ. 220 కోట్ల సంపాదన!

ABN , First Publish Date - 2020-12-20T21:21:24+05:30 IST

బుడ్డోడు ఇరగదీసాడుగా..

డబ్బే డబ్బు! 9 ఏళ్ల వయసులోనే రూ. 220 కోట్ల సంపాదన!

ఇంటర్నెట్ డెస్క్: సంపాదన మార్గం పట్టాలంటే.. ముందు బాగా చదువుకోవాలి..నైపుణ్యాలు పెంచుకోవాలి..వ్యాపారమో లేదా ఉద్యోగమో చేసుకోవాలి..ఇంత చేస్తే గానీ నాలుగు పచ్చనోట్లను కళ్లచూడటం కుదరదు. అయితే యూట్యూబ్ పుణ్యమా అని ప్రస్తుతం ఇటువంటి ఫార్ములాలన్నీ పాత చింతకాయ పచ్చడి అయిపోయాయి. జస్ట్ ఓ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి ప్రజలకు నచ్చిన కంటెంట్ అప్‌లోడ్ చేస్తే చాలు..ఇక కనకవర్షమే..ప్రపంచమంతా డబ్బుల మయమే! అచ్చు ఇదే ఫార్ములాతో రయాన్ కాజీ అనే 9 ఏళ్ల బాలుడు ఈ సంవత్సరంలో ఏకంగా 220 కోట్లు సంపాదించాడు. అవును..సంపాదనలో ప్రముఖ యూట్యూబర్లైన పూడీపై వంటివారిని కూడా అధికమించి ప్రస్తుతం నెం.1 స్థానానికి చేరుకున్నాడు.


అతడి యూట్యూబ్ ఛానల్‌కు ప్రస్తుతం 27 మిలియన్ల సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఈ బుడ్డోడి వీడియోలకు మొత్తం 12 బిలియన్ వ్యూస్ వచ్చిపడ్డాయి. ఇంతకీ మనోడి సక్సెస్ ఫార్ములాకు కారణం..రివ్యూస్. మార్కెట్లో కొత్తగా వచ్చే బొమ్మలను చూపిస్తూ తనకేమీ నచ్చిందో చెబుతూ వీడియోలను రికార్డు చేస్తాడు. అయితే తన వీడియోల్లో మనోడు తెగ హంగామా చేస్తాడు. చిన్నతపు అమాయకత్వం, ఎనర్జీ కలిసి ప్రేక్షకులను ఈ రివ్యూలకు అతుక్కుపోయేలా చేస్తున్నాయి. దీంతో..ప్రస్తుతం అతడి యూట్యూబ్ ఛానల్ కనక వర్షం కురిపిస్తోంది. కరోనా కారణంగా ప్రపంచమంతా ఇంటి పరిమితమవడం కూడా మనోడి సంపాదనను భారీగా పెంచేసింది. ఈ ఏడాది అత్యధిక యూట్యూబ్ సంపాదన కలిగి వాళ్లలో ఈ బుడ్డోడు టాప్‌లో నిలిచాడు. 

Updated Date - 2020-12-20T21:21:24+05:30 IST