70 ఏళ్ల వరుడు... 55 ఏళ్ల వధువు... పిల్లలు చేసిన పెళ్లి!

ABN , First Publish Date - 2020-09-03T15:48:12+05:30 IST

మనదేశంలో పెళ్లికి వయసును ముడిపెడుతుంటారు. అయితే కొన్ని ప్రేమ పెళ్లిళ్ల విషయంలో వయసు వారికి ఆటంకంగా నిలవదు. మధ్యప్రదేశ్‌లోని భూరఖెడీ గ్రామంలో ఒక విచిత్ర వివాహం జరిగింది. ఒక వృద్ధుడు...

70 ఏళ్ల వరుడు... 55 ఏళ్ల వధువు... పిల్లలు చేసిన పెళ్లి!

భోపాల్: మనదేశంలో పెళ్లికి వయసును ముడిపెడుతుంటారు.  అయితే కొన్ని ప్రేమ పెళ్లిళ్ల విషయంలో వయసు వారికి ఆటంకంగా నిలవదు. మధ్యప్రదేశ్‌లోని భూరఖెడీ గ్రామంలో ఒక విచిత్ర వివాహం జరిగింది. ఒక వృద్ధుడు వైద్య చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడ అతను ఒక వృద్ధ మహిళ ప్రేమలో పడ్డాడు. విషయం తెలుసుకున్న ఇంట్లోని చిన్నవాళ్లు తమ పెద్దలకు వివాహం జరిపించారు. ఈ ఉదంతంలో వరుని వయసు 70 కాగా, వధువు వయసు 55 ఏళ్లు. 70 ఏళ్ల ఓంకార్ సింగ్ జిల్లా ఆసుపత్రిలో చేరాడు. అక్కడ అతనికి 55 ఏళ్ల గుడ్డీబాయితో పరిచయమయ్యింది. మూడు రోజుల తరువాత వారిద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని వారి ఇంట్లోని పిల్లలకు చెప్పారు. ఓంకార్ సింగ్‌కు నలుగురు కుమారులు. వారు ఆ వృద్ధ జంటకు వివాహం జరిపించారు. ఈ వివాహ వేడుక స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

Updated Date - 2020-09-03T15:48:12+05:30 IST