-
-
Home » Prathyekam » 1500 motorists traffic jam in JK
-
హైవేపై ఆగిపోయిన 1500 వాహనాలు.. ఎక్కడంటే
ABN , First Publish Date - 2020-12-28T09:04:07+05:30 IST
ట్రాఫిక్ జామ్ అయితే ఎన్ని బళ్లు ఆగిపోతాయి? మహా అయితే వంద లేదంటే రెండొందలు అంతే కదా. ఇలా అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే.

జమ్మూకశ్మీర్: ట్రాఫిక్ జామ్ అయితే ఎన్ని బళ్లు ఆగిపోతాయి? మహా అయితే వంద లేదంటే రెండొందలు అంతే కదా. ఇలా అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఓ జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అవడంతో ఏకంగా 1500 వాహనాలు ఎక్కడివక్కడే ఆగిపోవాల్సి వచ్చింది. ఈ ఘటన జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై జరిగింది. ఈ వాహనదారులు ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 10 గంటలపాటు ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోవలసి వచ్చింది. రాంబన్ జిల్లాలో ఓ ప్రాంతంలో కొండ చరియలు విరిగి పడటంతోనే ఈ ట్రాఫిక్ జామ్ జరిగింది. దీంతో ఉదయం 9.30 నుంచి సాయంత్రం 7.30 గంటల ఇక్కడూ ఉందని అధికారులు చెప్తున్నారు.