పాము కాదు.. ఇది కూడా చేపే!

ABN , First Publish Date - 2020-12-11T18:51:31+05:30 IST

పైనున్న ఫోటో చూడగానే ఏదో పామును పట్టుకున్నాడనిపిస్తోందని కదా..? కానీ కాదు. అతడు పట్టుకుంది ఓ చేప. నమ్మడానికి ఆశ్చర్యంగా...

పాము కాదు.. ఇది కూడా చేపే!

ఇంటర్నెట్ డెస్క్: పైనున్న ఫోటో చూడగానే ఏదో పామును పట్టుకున్నాడనిపిస్తోందని కదా..? కానీ కాదు. అతడు పట్టుకుంది ఓ చేప. నమ్మడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. కాకినాడలోని కుంభాభిషేకంలోని ఓ బహిరంగ మార్కెట్‌లో గురువారం ఈ అరుదైన చేప కనిపించింది. పండు అనే స్థానిక మత్స్యకారుడు దీనిని విక్రయించేందుకు మార్కెట్‌కు తీసుకువచ్చాడు. దీనిని చూసిన వారంతా పాము అనుకుని భయపడ్డారు. అయితే ఇది పాము కాదని, ఓ జాతి సముద్రపు చేప అని పండు వివరించడంతో జనాలు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. 10 అడుగుల పొడవున్న ఈ చేపను రూ.150కు విక్రయించినట్లు తెలుస్తోంది. 


అరుదైన ఈ చేప గురించి కేంద్ర మత్స్య పరిశోధనా సంస్థల్లో టెక్నికల్ ఆఫీసర్‌గా పనిచేసిన ధరనాజు మాట్లాడుతూ, ఈ చేపలను మెరైన్ ఈల్(సముద్రపు చేపల) అంటారని,  తెలుపు, నలుపు రంగులో ఉంటాయని తెలిపారు. నల్ల రంగులో ఉన్న వాటిని పీతల మేతగా వినియోగిస్తారని చెప్పారు. ఈ చేపను ఏంజెల్లా టైకాలర్ అనే శాస్త్రీయ నామంతో గుర్తించడం జరుగుతుందని చెప్పారు.

Updated Date - 2020-12-11T18:51:31+05:30 IST