‘వండర్’ బాయ్.. 29 నిమిషాల్లో 20 పాటలు!
ABN , First Publish Date - 2020-12-30T14:13:10+05:30 IST
20 పాటలను 29 నిమిషాల 19 సెకండ్లలో వాయించి

హైదరాబాద్ : కళ్లకు గంతలు కట్టుకొని పియానోపై 20 పాటలను 29 నిమిషాల 19 సెకండ్లలో వాయించి 13 ఏళ్ల హరిహరన్ నాయుడు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధించాడు. సికింద్రాబాద్ లయన్స్ క్లబ్లో మంగళవారం జరిగిన ఈ కార్యక్రమానికి ప్రముఖ సంగీత దర్శకులు అనూప్ రూబెన్స్, మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలచారి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. తెలంగాణ బిడ్డకు ఈ అవార్డు రావడం గొప్ప విషయమన్నారు. ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సౌత్ ఇన్చార్జి స్వర్ణశ్రీ గుర్రం మాట్లాడుతూ కళ్ళకు గంతలు కట్టుకుని ఇలాంటి రికార్డు చేయడం ఇదే మెదటిసారని హరిహరన్ను అభినందించారు.