షార్క్‌ విశేషాలివి!

ABN , First Publish Date - 2020-10-03T05:30:00+05:30 IST

షార్క్‌ శరీరంలో ఒక్క ఎముక కూడా ఉండదు. ఎముకల గూడుకు బదులుగా కార్టిలేజ్‌తో శరీరం నిర్మితమై ఉంటుంది...

షార్క్‌ విశేషాలివి!

షార్క్‌ శరీరంలో ఒక్క ఎముక కూడా ఉండదు. ఎముకల గూడుకు బదులుగా కార్టిలేజ్‌తో శరీరం నిర్మితమై ఉంటుంది. 


షార్క్‌లు చాలా దృఢమైనవి. ఇతర  జీవులతో పోలిస్తే ఇవి వాటి ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తాయి. యాంటీ కేన్సర్‌ ఔషధాల తయారీలో షార్క్‌ కార్టిలేజ్‌ ఉపయోగపడుతుందేమోనని శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతున్నారు. 


షార్క్‌లు 25 ఏళ్ల పాటు జీవిస్తాయి. కొన్ని రకాల షార్క్‌లు మాత్రం వందేళ్ల  వరకు జీవిస్తాయని పరిశోధకులు అంటున్నారు.


ఇవి గంటలకు 20 నుంచి 40 మైళ్ల వేగంతో ఈదుతాయి.


షార్క్‌లు ఎప్పుడూ కదులుతూనే ఉంటాయి. ఒకవేళ కదలకుండా ఉంటే అవి నీటిలో మునిగిపోతాయి. 


షార్క్‌లు నిద్రపోవు. ఒకవేళ నిద్రపోతున్నట్టు కనిపిస్తే అవి విశ్రాంతి తీసుకుంటున్నట్టుగా భావించాలి. అంతేకానీ అది నిద్ర కాదు.


షార్క్‌ దంతం ఊడిపోతే, ఆ ప్రదేశంలో కొత్త దంతం వస్తుంది. ప్రతి ఎనిమిది రోజులకు వీటికి కొత్త దంతం వస్తూ ఉంటుంది. ఒక షార్క్‌ జీవితకాలంలో 30 వేల దంతాలు వస్తాయని అంచనా. 


నీటిలో వచ్చే వైబ్రేషన్స్‌ను షార్క్‌లు సులభంగా పసిగడతాయి. కొన్ని వందల అడుగుల దూరం నుంచే ఇతర జంతువుల జాడను కూడా ఇవి గుర్తిస్తాయి. 


షార్క్‌లకు ఈదడానికి చాలా తక్కువ శక్తి సరిపోతుంది. షార్క్‌ ఒకసారి అధిక మొత్తంలో ఆహారం తీసుకుంటే, తరువాత మూడు నెలల పాటు ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఉండగలదు.

Updated Date - 2020-10-03T05:30:00+05:30 IST