శభాష్ రాఘవ్!
ABN , First Publish Date - 2020-10-19T05:43:44+05:30 IST
ఏడేళ్ల వయసులోనే అద్భుతమైన జ్ఞాపకశక్తితో అందరినీ ఆకట్టుకుంటున్నాడు రాఘవ్ అభిజిత్.
ఏడేళ్ల వయసులోనే అద్భుతమైన జ్ఞాపకశక్తితో అందరినీ ఆకట్టుకుంటున్నాడు రాఘవ్ అభిజిత్.
పుణేకు చెందిన రాఘవ్ 178 దేశాల జాతీయ పతాకాలను గుర్తిస్తాడు. ఏ దేశ పతాకం చూపించి అడిగినా సరిగ్గా సమాధానం చెబుతాడు.
225 దేశాల రాజధానుల పేర్లను గుక్కతిప్పుకోకుండా చెప్పేస్తాడు. మూడేళ్ల వయసులోనే ఏదైనా నేర్పిస్తే గుర్తుపెట్టుకుని, మళ్లీ అడిగితే ఠక్కున చెప్పేవాడు. అతని ప్రతిభను గుర్తించి తల్లితండ్రులు ప్రోత్సహించారు.
అలా ఈ బుడతడు గ్రహాలు, వాటి విశేషాలు, జనరల్ నాలెడ్జ్‌కు సంబంధించిన అంశాలపై పట్టు సాధించాడు.
3 గీ 3 రూబిక్ క్యూబ్‌ను 1 నిమిషం 6 సెకన్లలో పూర్తి చేసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డుల్లోనూ స్థానం సంపాదించాడు.