సాంచీ స్తూపం
ABN , First Publish Date - 2020-10-31T06:09:25+05:30 IST
పురాతనమైన, ప్రసిద్ధ బౌద్ధ కట్టడాల్లో ఇదొకటి. వందల ఏళ్లు గడిచినా ఇంకా చెక్కుచెదరకుండా పర్యాటకులను ఆకర్షిస్తోంది.
పురాతనమైన, ప్రసిద్ధ బౌద్ధ కట్టడాల్లో ఇదొకటి. వందల ఏళ్లు గడిచినా ఇంకా చెక్కుచెదరకుండా పర్యాటకులను ఆకర్షిస్తోంది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌కు సమీపంలో ఉన్న సాంచీ స్తూపం విశేషాలు ఇవి...
సాంచీ స్తూపాన్ని బుద్ధుడి గౌరవార్థం 3వ శతాబ్దంలో అశోక చక్రవర్తి నిర్మించాడు. తరువాత కాలంలో దెబ్బతిన్నా, తిరిగి మరమ్మతులు చేశారు.
ఈ స్తూపంలో అనేక గదులు ఉన్నాయి. స్తూపం ఎత్తు 54 అడుగులు. ఇక్కడ బుద్ధుడికి సంబంధించిన అనేక విషయాలు తెలుసుకోవచ్చు.
భారత జాతీయ చిహ్నానికి మూలం ఇక్కడే ఉంది. మన జాతీయ చిహ్నమైన మూడు సింహాల గుర్తును ఈ స్తూపంలో ఉన్న అశోక స్తంభం నుంచి తీసుకున్నారు.
ఈ స్తూపాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది.
స్తూపంపై బుద్ధుడి విగ్రహాలు, శిల్పాలు ఆకట్టుకుంటాయి. ఈ స్తూపానికి నాలుగు ద్వారాలున్నాయి. ఇవి బుద్ధుడి జీవితం, జాతక కథలు, బుద్ధుడి జన్మవృత్తాంతాన్ని తెలియచేస్తాయి.