పాపం పిసినారి!

ABN , First Publish Date - 2020-12-15T05:50:54+05:30 IST

ఒక ఊరిలో ఓ ముసలి ధనవంతుడు ఉండేవాడు. అతడు బాగా పిసినారి. డబ్బులున్నా ఖర్చు పెట్టేవాడు కాదు. సహాయం కోరి వచ్చే వారిని ఆదుకునేవాడు కాదు. తన దగ్గర ఉన్న డబ్బులు, బంగారాన్ని దొంగలు దోచుకెళ్తారనే భయంతో గడిపేవాడు.

పాపం పిసినారి!

క ఊరిలో ఓ ముసలి ధనవంతుడు ఉండేవాడు. అతడు బాగా పిసినారి. డబ్బులున్నా ఖర్చు పెట్టేవాడు కాదు. సహాయం కోరి వచ్చే వారిని ఆదుకునేవాడు కాదు. తన దగ్గర ఉన్న డబ్బులు, బంగారాన్ని దొంగలు దోచుకెళ్తారనే భయంతో గడిపేవాడు. రోజూ పెరట్లో గొయ్యి తవ్వి బంగారం, డబ్బులు ఉన్న మూటను దాచి పెట్టేవాడు. ఉదయాన్నే తవ్వి చూసుకునే వాడు. రోజూ అలాగే చేసేవాడు. అతడి తీరును గమనించిన ఓ దొంగ ఒకరోజు పెరట్లోని చెట్టుపైన నక్కాడు. అప్పుడే ఆ ముసలి ధనవంతుడు బంగారం మూటను తీసుకొచ్చి పెరట్లో గొయ్యి తవ్వి పెట్టాడు.


అదంతా గమనించిన దొంగ రాత్రి కాగానే గొయ్యిలో నుంచి మూటను తీసుకెళ్లాడు. ఉదయాన్నే ఆ ధనవంతుడు గొయ్యిలో బంగారు మూట లేకపోవడం చూసి ఘొల్లుమన్నాడు. ‘‘నా బంగారం, డబ్బులన్నీ దొంగలెత్తుకుపోయారు’’అని ఏడ్చాడు. ఎక్కడ పెట్టావని ఊర్లో వాళ్లు అడిగితే పెరట్లో గొయ్యి తవ్వి దాచి పెట్టానని చెప్పాడు. ‘మట్టిలో దాచిపెట్టిన డబ్బులు, బంగారం నీ దగ్గర ఉన్నా, పోయినా ఒక్కటే. నీ పిసినారికి తగిన శాస్తి జరిగింది’ అని వెళ్లిపోయారు.

Read more