జ్ఞానోదయం!

ABN , First Publish Date - 2020-10-14T04:45:34+05:30 IST

రామాపురంలో శ్రీరాములు అనే డాక్టర్‌ ఉండేవాడు. ఆయన వయస్సు 70 సంవత్సరాలు ఆయనకు పేదల డాక్టర్‌ అని పేరు ఉంది.

జ్ఞానోదయం!

కథ

రామాపురంలో శ్రీరాములు అనే డాక్టర్‌ ఉండేవాడు. ఆయన వయస్సు 70 సంవత్సరాలు ఆయనకు పేదల డాక్టర్‌ అని పేరు ఉంది. అదే ఊరిలో పరుశరామ్‌ అని ఎంబీబీఎస్‌ డాక్టర్‌ కూడా ఉండేవాడు. ఆయన పేరుకు తగ్గట్టే తన దగ్గరకు వచ్చే రోగులతో కోపంగా, పరుషంగా మాట్లాడేవాడు. అతని ప్రవర్తన, కోపం వల్ల రోగులు అతని దగ్గరికి వెళ్లడానికి భయపడేవాళ్లు. శ్రీరాములు రోగులను మంచిగా పలకరిస్తూ వైద్యం చేసేవాడు. ఊరిలో ఉన్న ప్రజలు కూడా అతని వైద్యానికి మెచ్చుకునేవారు. ఎటువంటి రోగమైనా తగ్గేదని అభినందించేవారు.


కొంతకాలం తర్వాత రోడ్డు ప్రమాదంలో పరుశురామ్‌ కుడికాలు విరిగితే శ్రీ రాములు కొన్ని రోజుల వరకు తన చిన్న ఆసుపత్రిలో ఒక కుటుంబ సభ్యుడిగా చికిత్స చేశాడు. ఆరోగ్యం కుదుట పడిన తర్వాత పరుశరామ్‌ ప్రవర్తనలో మార్పు వచ్చింది. శ్రీరాములును చూసి జ్ఞానోదయం కలిగింది. ఆ తరువాత పరశురామ్‌ ప్రజలతో ఎప్పుడూ పరుషంగా మాట్లాడలేదు. ప్రజల మేలు కోసం తన చుట్టుపక్కల గ్రామాలకు కూడా ఉచిత వైద్యం అందిస్తూ, స్నేహపూర్వకంగా మాట్లాడుతూ, ఊరి ప్రజల మన్ననలు పొందాడు.


-పంపినవారు:తాటి భాను తేజ్‌నారాయణపేట

Updated Date - 2020-10-14T04:45:34+05:30 IST