నౌకాసనంతో జీర్ణం తేలిక

ABN , First Publish Date - 2020-08-16T05:30:00+05:30 IST

ఈ ఆసనం పొట్ట కండరాలను బలోపేతం చేస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. దాంతో మలబద్ధకం, జీర్ణసమస్యలు దరిచేరవు. ఈ ఆసనం ఎలా వేయాలంటే...

నౌకాసనంతో జీర్ణం తేలిక

ఈ ఆసనం పొట్ట కండరాలను బలోపేతం చేస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. దాంతో మలబద్ధకం, జీర్ణసమస్యలు దరిచేరవు. ఈ ఆసనం ఎలా వేయాలంటే...

  1. నేలపై వెల్లకిలా పడుకోవాలి. చేతులు, కాళ్లు రిలాక్స్‌గా పెట్టాలి.
  2. ఇప్పుడు గట్టిగా శ్వాస పీల్చి నెమ్మదిగా కాళ్లను పైకి లేపాలి. అదే సమయంలో ఛాతీ భాగాన్ని పైకి లేపాలి. 
  3. చేతులను మెకాళ్లకు ఆనిస్తున్నట్టుగా పెట్టాలి. శరీరం ‘వి’ ఆకారంలో ఉండాలి. 
  4. ఈ భంగిమలో ఎంతసేపు వీలైతే అంతసేపు ఉండాలి. తరువాత శ్వాసను నెమ్మదిగా వదులుతూ యథాస్థానానికి రావాలి.
  5. ఇలా ఈ ఆసనాన్ని రోజుకు నాలుగైదు సార్లు చేయాలి.

Updated Date - 2020-08-16T05:30:00+05:30 IST