గొర్రె ఖరీదు 3.5 కోట్లు!
ABN , First Publish Date - 2020-09-03T05:30:00+05:30 IST
మన దగ్గర ఒక గొర్రె మహా అయితే ఇరవై వేలు ధర పలుకుతుంది. కానీ స్కాట్లాండ్లో జరిగిన ఒక వేలంలో ఒక గొర్రె అక్షరాలా మూడున్నర కోట్ల రికార్డు ధరకు అమ్ముడుపోయింది. ఆ గొర్రె పేరు డబుల్ డైమండ్...

మన దగ్గర ఒక గొర్రె మహా అయితే ఇరవై వేలు ధర పలుకుతుంది. కానీ స్కాట్లాండ్లో జరిగిన ఒక వేలంలో ఒక గొర్రె అక్షరాలా మూడున్నర కోట్ల రికార్డు ధరకు అమ్ముడుపోయింది. ఆ గొర్రె పేరు డబుల్ డైమండ్.
- చెషైర్‌కు చెందిన చార్లీ బొడెన్ అనే వ్యక్తి ఈ గొర్రెను విక్రయించాడు. ఆ గొర్రె అంత ధర పలుకుతుందని అతడు కూడా ఊహించలేదు. ఒక్కసారిగా కోట్ల రూపాయలు వచ్చి పడడంతో ఉబ్బితబ్బియ్యాడు.
- కళ్లు, రూపం, రంగు అన్నింటిలోనూ ఈ గొర్రె ఎంతో ప్రత్యేకం. మేలుజాతి గొర్రెల ఉత్పత్తి కోసం ఈ గొర్రె పనికొస్తుంది. అందుకే రైతులు వేలంలో పోటీపడ్డారు. కొందరు రైతులు సంయుక్తంగా కలిసి వేలంలో ఎక్కువ ధరకు దక్కించుకున్నారు.
- ఈ రకం గొర్రెలు నెదర్లాండ్స్‌లోని టెక్సెల్ ద్వీపంలోనవి. వీటిని గొర్రెలలో అత్యుత్తమమైనవిగా చెబుతారు. వీటి మాంసం నాణ్యంగా, రుచిగా ఉంటుంది.