వీల్‌ స్కూటర్‌!

ABN , First Publish Date - 2020-04-07T05:30:00+05:30 IST

ఇంటి పట్టునే ఉంటే బోర్‌ కొడుతోంది కదూ! అయితే వీల్‌ స్కూటర్‌ తయారుచేయండి. కాస్త టైం పాస్‌ అవుతుంది. బొమ్మ తయారు...

వీల్‌ స్కూటర్‌!

ఇంటి పట్టునే ఉంటే బోర్‌ కొడుతోంది కదూ! అయితే వీల్‌ స్కూటర్‌ తయారుచేయండి. కాస్త టైం పాస్‌ అవుతుంది. బొమ్మ తయారు చేసినట్టవుతుంది. 


కావలసినవి:

 1. తేలికపాటి అట్టముక్క
 2. ఐస్‌క్రీమ్‌ పుల్లలు 
 3. స్ట్రాలు
 4. జిగురు
 5. కత్తెర
 6. శాండ్‌పేపర్‌ తయారీ
 7. అట్ట ముక్కను బొమ్మలో చూపించిన విధంగా మూలలు కత్తిరించండి.
 8. ఐస్‌క్రీమ్‌ పుల్లలు రెండు అంగుళాల పొడవుండేలా కట్‌ చేసుకోవాలి.
 9. ఐస్‌క్రీమ్‌ పుల్ల రెండో వైపు కూడా గుండ్రంగా అయ్యేలా శాండ్‌ పేపర్‌తో రుద్దండి.
 10. స్ట్రాను తీసుకొని ఐస్‌క్రీమ్‌ పుల్ల వెడల్పులో రెండు ముక్కలు చేయండి. 
 11. బొమ్మలో చూపిన విధంగా ఆ స్ట్రా ముక్కలను ఐస్‌క్రీమ్‌ పుల్ల కింద చక్రాల్లా జిగురుతో అతికించండి.
 12. ఇప్పుడు ఐస్‌క్రీమ్‌ పుల్లలను జిగురు సహాయంతో అట్టముక్కకు 
 13. అతికించండి.
 14. మరొక స్ట్రా తీసుకొని రెండు సమానమైన ముక్కలుగా కట్‌ చేసుకోండి. మరొక స్ట్రా తీసుకొని కాస్త చిన్న ముక్క కత్తిరించండి.
 15. వీటిని పట్టుకోవడానికి ఉపయోగపడే విధంగా స్టాండ్‌ కోసం అట్ట ముక్కపై అతికించండి. 
 16. అంతే... ఆడుకునే వీల్‌ స్కూటర్‌ రెడీ. 

Read more