ఏ ఖండం... ఎక్కడ?
ABN , First Publish Date - 2020-04-12T05:46:38+05:30 IST
ఇంట్లోనే సరదాతోపాటు మెదడుకు పదును పెట్టే ఆటలను ఎంచుకుంటే టైం ఇట్టే గడిచిపోతుంది. ఇంకెందుకాలస్యం...

ఇంట్లోనే సరదాతోపాటు మెదడుకు పదును పెట్టే ఆటలను ఎంచుకుంటే టైం ఇట్టే గడిచిపోతుంది. ఇంకెందుకాలస్యం... ఈ యాక్టివిటీని ట్రై చేయండి.
కావలసినవి
- పెద్ద షీట్
- మార్కర్
- కత్తెర
- పేపర్ పిన్నులు
- చిన్న కాగితం ముక్కలు
ఇలా చేయండి!
- షీట్‌పై ప్రపంచ పటాన్ని గీయండి. అందులో ఏడు ఖండాలు, వాటి పేర్లు రాయండి. అవసరమైతే ఇందుకోసం మీ పుస్తకాలు చూడండి. స్మార్ట్‌ఫోన్‌లో, కంప్యూటర్‌లో వరల్డ్‌మ్యాప్ పెట్టుకొని కూడా గీయొచ్చు.
- పటం గీయడం పూర్తయ్యాక ఒక చోట వేలాడదీయండి.
- కాగితం ముక్కలపై ఖండాల పేర్లు రాసి ఒక చిన్న ప్లాస్టిక్ బౌల్‌లో వేయండి.
- ఒక్కొక్కరు ఒక్కో పేపరు తీయాలి. ముందుగా పేపర్ తీసిన వ్యక్తిని అందులో రాసి ఉన్న ఖండం పేరు చదువుకొమ్మని చెప్పాలి.
- తరువాత అతని కళ్లకు గంతలు కట్టి, రెండు మూడుసార్లు గుండ్రంగా తిప్పి వదిలిపెట్టాలి.
- అతను చూడకుండా పటంపై సరైన చోట పిన్‌తో పేపర్‌ను గుచ్చాలి.
- ఈ యాక్టివిటీ వల్ల ఖండాలు, అవి ఉన్న ప్రదేశాలను సులభంగా నేర్చుకోవచ్చు.