పది తలల రావణుడు!

ABN , First Publish Date - 2020-05-08T05:30:00+05:30 IST

లంకాధిపతి రావణుడికి పది తలలు ఉండేవని పుస్తకాల్లో చదివే ఉన్నారు కదా! మరి రావణుడికి పది తలలు ఎలా వచ్చాయో తెలుసా?...

పది తలల రావణుడు!

లంకాధిపతి రావణుడికి పది తలలు ఉండేవని పుస్తకాల్లో చదివే ఉన్నారు కదా! మరి రావణుడికి పది తలలు ఎలా వచ్చాయో తెలుసా?


రావణుడు శివుడికి పరమభక్తుడు. విద్యాభ్యాసం పూర్తయిన తరువాత శివుడిని ప్రసన్నం చేసుకోవడం కోసం ఘోర తపస్సు చేశాడు.

ఏళ్ల తరబడి చేసిన ఆ తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమయి ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు రావణుడు పది తలలు కావాలని కోరాడు. అందులోని ఏ తలను ఖండించినా, మళ్లీ తల వచ్చేలా వరం కావాలన్నాడు. అందుకు భోళా శంకరుడు సరే అన్నాడు. 

అప్పటి నుంచి రావణుడు భూలోకంలో శక్తిమంతమైన రాజుగా పేరొందాడు. 

రాముడు రావణుడిని సంహరించే సమయంలో ధనుస్సుతో ఎన్నిసార్లు శిరస్సు ఖండించినా మళ్లీ వస్తూనే ఉంటుంది. అందుకే పొట్టలో బాణాన్ని సంధించి రావణుడిని సంహరించారు.

Updated Date - 2020-05-08T05:30:00+05:30 IST