బిగ్గరగా చదవండి!
ABN , First Publish Date - 2020-05-18T06:34:36+05:30 IST
ఇంట్లో డాడీ స్మార్ట్‌ఫోన్‌లో గేమ్స్ ఆడుతూ ఉంటారు. యూట్యూబ్‌లో వీడియోలు చూస్తుంటారు. ఎప్పుడూ అవే కాకుండా కాస్త చదువుపై కూడా దృష్టిపెట్టండి. ‘బోలో’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని కథలు బిగ్గరగా చదవడం...

ఇంట్లో డాడీ స్మార్ట్‌ఫోన్‌లో గేమ్స్ ఆడుతూ ఉంటారు. యూట్యూబ్‌లో వీడియోలు చూస్తుంటారు. ఎప్పుడూ అవే కాకుండా కాస్త చదువుపై కూడా దృష్టిపెట్టండి. ‘బోలో’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని కథలు బిగ్గరగా చదవడం వల్ల భాషా నైపుణ్యం పెరుగుతుంది. ఈ యాప్‌ను ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
- ఇంగ్లీష్ రీడింగ్ స్కిల్స్ పెంచుకోవడానికి ఈ యాప్ బాగా పనికొస్తుంది. తెలుగు బాగా చదవలేని వారికి కూడా ఉపయుక్తంగా ఉంటుంది.
- ఇందులో ఉండే యాప్ అసిస్టెంట్ ‘దియా’ మీకు సహాయపడుతుంది. మీరు చదువుతున్నప్పుడు ‘దియా’ వింటుంది. తప్పులు చదివినట్టయితే వెంటనే చెబుతుంది. చదివే సమయంలో పదం ఎలా ఉచ్ఛరించాలో తెలియక ఆగిపోతే మీకు సహాయం చేస్తుంది.
- ఆఫ్‌లైన్‌లోనూ ఈ యాప్‌ను ఉపయోగించుకోవచ్చు. రోజూ కొత్త కొత్త పుస్తకాలు యాడ్ అవుతూ ఉంటాయి.
- ఇంగ్లీష్, హిందీ, తెలుగు, హిందీతో పాటు ఇంకా చాలా భాషలు అందుబాటులో ఉన్నాయి. మీకు నచ్చిన భాషను ఎంచుకోవచ్చు.
- ఇందులో ఎడ్యుకేషనల్ గేమ్స్ కూడా ఉన్నాయి. వ్యక్తిగత ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవచ్చు. రీడింగ్ లెవెల్‌ను బట్టి పుస్తకాలు ఎంచుకోవచ్చు.