పదాల పదనిస!

ABN , First Publish Date - 2020-06-22T05:30:00+05:30 IST

ఈ యాక్టివిటీ మీ ఇంగ్లీషు పదజాలాన్ని పెంచుతుంది. నలుగురైదుగురు స్నేహితులు కలిసి ఆడుకోవచ్చు. ఈ యాక్టివిటీ కోసం...

పదాల పదనిస!

ఈ యాక్టివిటీ మీ ఇంగ్లీషు పదజాలాన్ని పెంచుతుంది. నలుగురైదుగురు స్నేహితులు కలిసి ఆడుకోవచ్చు. ఈ యాక్టివిటీ కోసం


కావలసినవి...

కొన్ని స్టికీ నోట్‌ప్యాడ్స్‌

కలర్‌ పెన్స్‌

బోర్డ్‌


ఇలా చేయాలి...

  1. ముందుగా స్టికీ నోట్స్‌పై అందరూ ఇంగ్లీషు అక్షరాలు రాయాలి. ఇంకొన్ని స్టికీ నోట్స్‌ అదనంగా ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి. 
  2. ఇప్పుడు ఇంగ్లీషు అక్షరాలను బోర్డ్‌పై అతికించాలి.
  3. తరువాత ఒక్కొక్కరు ఆ అక్షరాల పక్కన తమకిష్టమైన మరో అక్షరాన్ని అతికించాలి. 
  4. ఇలా అతికిస్తూ వెళుతున్న క్రమంలో ఒక పదం తయారయ్యేలా చూడాలి. 
  5. ఏ అక్షరం తరువాత ఏది పెడితే పదం పూర్తవుతుందో ఆలోచిస్తూ యాక్టివిటీ పూర్తి చేయాలి. ఎన్ని పదాలు వీలయితే అన్ని పదాలు చేయాలి. 

Updated Date - 2020-06-22T05:30:00+05:30 IST