ఆనందాల దసరా!
ABN , First Publish Date - 2020-10-25T05:14:34+05:30 IST
ఈ రోజు దసరా పండుగ. చిన్నా పెద్దా తేడా లేకుండా, అన్ని రాష్ట్రాల ప్రజలు ఆనందంగా జరుపుకొనే పండుగ ఇది. మనదేశంలోనే కాకుండా నేపాల్, బంగ్లాదేశ్, మలేసియా దేశాల్లోనూ దసరా ఉత్సవాలు నిర్వహిస్తారు...

ఈ రోజు దసరా పండుగ. చిన్నా పెద్దా తేడా లేకుండా, అన్ని రాష్ట్రాల ప్రజలు ఆనందంగా జరుపుకొనే పండుగ ఇది. మనదేశంలోనే కాకుండా నేపాల్, బంగ్లాదేశ్, మలేసియా దేశాల్లోనూ దసరా ఉత్సవాలు నిర్వహిస్తారు. విదేశాల్లో స్థిరపడిన భారతీయులుందరూ దసరా పండుగ జరుపుకొంటారు.
- దసరా రోజున జమ్మి చెట్టుకు పూజలు చేస్తారు. జమ్మిచెట్టుకు ప్రదక్షిణలు చేసి, ఆ జమ్మి చెట్టు ఆకులను పెద్దలకు ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటారు. పాండవులు వనవాసం సమయంలో తమ ఆయుధాలను జమ్మిచెట్టుపై భద్రపరచారని పురాణాలు చెబుతున్నాయి.
- విజయదశమి రోజున వాహన పూజ, ఆయుధపూజ చేస్తారు.
- హిందూ పురాణాల ప్రకారం రాముడి, రావణుడికి మధ్య తొమ్మిది రోజుల పాటు భీకరయుద్ధం జరిగింది. పదో రోజున రాముడు రావణుడిని సంహరించాడు. ఆ రోజునే దసరా జరుపుకొంటారు.
- దసరాను విజయదశమి అని కూడా పిలుస్తారు. మహిషాసురుడనే రాక్షసుడిని దుర్గాదేవి సంహరించింది. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దసరా పండుగను ప్రజలందరూ ఆనందంగా జరుపుకొంటారు.