ఒకేసారి రెండు చేతులతో..!
ABN , First Publish Date - 2020-03-23T05:30:00+05:30 IST
ఒక చేత్తో అందంగా బొమ్మలు గీయడం నైపుణ్యమున్న చిత్రకారుని వల్లే అవుతుంది. కానీ అదే ఆర్టిస్టును రెండు చేతులతో బొమ్మలేయమంటే నావల్ల కాదని చేతులెత్తేస్తాడు. అయితే..

ఒక చేత్తో అందంగా బొమ్మలు గీయడం నైపుణ్యమున్న చిత్రకారుని వల్లే అవుతుంది. కానీ అదే ఆర్టిస్టును రెండు చేతులతో బొమ్మలేయమంటే నావల్ల కాదని చేతులెత్తేస్తాడు. అయితే డెట్రాయిట్‌కు చెందిన కోలిన్ డార్క్ అనే ఆర్టిస్టు ఏకకాలంలో రెండు చేతులతో బొమ్మలేయడంలో సిద్ధహస్తుడు. అతని నైపుణ్యం చూస్తే ఎవరైనా మెచ్చుకోకుండా ఉండలేరు. కుడి చేత్తో ఎంత బాగా బొమ్మ వేయగలరో, ఎడమ చేత్తో అంతే బాగా బొమ్మలు వేసే వాళ్లుంటారు. కానీ కోలిన్ మాత్రం రెండు చేతులను ఒకేసారి ఉపయోగిస్తూ, రకరకాల రంగులు వాడుతూ బొమ్మ వేసేస్తాడు. సెలబ్రిటీల బొమ్మలతో మొదలు సినిమా క్యారెక్టర్ల బొమ్మలు, జంతువుల బొమ్మలు, ప్రకృతిని ప్రతిబింబించే చిత్రాలను అవలీలగా వేస్తుంటాడు. ఇన్ని రోజులు తన ప్రతిభ గురించి ఎవరికీ చెప్పుకోలేదు. కానీ ఇటీవలే ఒక మోటివేషనల్ స్పీకర్ ప్రసంగం విని స్ఫూర్తి పొందిన కోలిన్ ఒకేసారి రెండు చేతులతో బొమ్మలు గీస్తోన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాడు. ఇక చెప్పేదేముంది సోషల్ మీడియాలో కోలిన్ టాలెంట్‌ను అభినందిస్తూ సందేశాలు వెల్లువెత్తుతున్నాయి.