తేనెటీగలతో ఏనుగులకు చెక్‌!

ABN , First Publish Date - 2020-04-01T06:00:11+05:30 IST

ఏనుగుల నుంచి పంటలను రక్షించుకోవడానికి తీగలతో ఫెన్సింగ్‌లు ఏర్పాటు చేయడం చూసే ఉంటారు. కానీ ఆఫ్రికాలో కొందరు రైతులు ఏనుగుల బారి నుంచి పంటను...

తేనెటీగలతో ఏనుగులకు చెక్‌!

ఏనుగుల నుంచి పంటలను రక్షించుకోవడానికి తీగలతో ఫెన్సింగ్‌లు ఏర్పాటు చేయడం చూసే ఉంటారు. కానీ ఆఫ్రికాలో కొందరు రైతులు ఏనుగుల బారి నుంచి పంటను కాపాడుకోవడం కోసం తేనెటీగలను పెంచుతారు. 


బ్రిటిష్‌ పరిశోధకులు కెన్యాలో పనిచేసిన సమయంలో రైతులకు ఈ సలహా సూచించారు. ఏనుగులు సహజంగానే తేనెటీగలను చూస్తే భయపడతాయి. తేనెటీగలు చేసే శబ్దాన్ని ఏనుగులు సులభంగా గుర్తించి, వాటికి దూరంగా వెళతాయి.


పొలం చుట్టూ తీగలు ఏర్పాటు చేసి, వాటికి విద్యుత్‌ సరఫరా అయ్యేలా చేసి ఏనుగులు రాకుండా చేసే వారు. అయితే దానివల్ల ఏనుగులు మరణించడం, గాయపడటం, కొన్నిసార్లు రైతులే ప్రమాదాల బారినపడటం జరిగేది. పైగా కొందరు రైతులు విద్యుత్‌ సరఫరా ఉండేది కాదు. 


ఈ ఇబ్బందులన్నీ తేనెటీగల పెంపకంతో దూరమయ్యాయి. పొలం చుట్టూ అక్కడక్కడా పెట్టెలు ఏర్పాటు చేసి వాటిలో తేనెటీగల పెంపకాన్ని మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఏనుగులు ఆ వైపు రావడం మానేశాయి. అంతేకాకుండా తేనెటీగల పెంపకంతో రైతులకు అదనపు ఆదాయం సమకూరింది.

Updated Date - 2020-04-01T06:00:11+05:30 IST