సేతు బంధ సర్వాంగాసనం
ABN , First Publish Date - 2020-06-21T05:30:00+05:30 IST
ఈ రోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఇప్పటికే మీరు కొన్ని యోగాసనాల గురించి తెలుసుకున్నారు. రోజూ ఆ యోగాసనాలు సాధన చేస్తుంటే ఫరవాలేదు. ఒకవేళ చేయకపోతే ఈ రోజు నుంచి తప్పకుండా మొదలుపెట్టండి...
ఈ రోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఇప్పటికే మీరు కొన్ని యోగాసనాల గురించి తెలుసుకున్నారు. రోజూ ఆ యోగాసనాలు సాధన చేస్తుంటే ఫరవాలేదు. ఒకవేళ చేయకపోతే ఈ రోజు నుంచి తప్పకుండా మొదలుపెట్టండి. ఇప్పుడు సేతు బంధ సర్వాంగాసనం(బ్రిడ్జ్ పోస్) గురించి తెలుసుకుందాం!
- నేలపై వెల్లకిలా పడుకోవాలి.
- మోకాళ్లను వంచాలి. పాదాలు నేలపై ఆనించాలి. చేతులు రిలాక్స్డ్గా నేలను ఆనుకొని ఉండాలి.
- ఇప్పుడు గట్టిగా శ్వాస పీల్చి వీపు భాగాన్ని పైకి లేపాలి. శరీర బరువు మొత్తం పాదాలు, భుజాలపై ఉండాలి.
- చేతులు రెండింటిని ఒకదానితో ఒకటి పట్టుకోవాలి. ఎంతసేపు వీలైతే అంత సేపు ఈ భంగిమలో ఉండాలి. శ్వాసను నెమ్మదిగా వదలడం, తీసుకోవడం చేస్తుండాలి.
- తరువాత నెమ్మదిగా సాధారణ స్థితిలోకి రావాలి. ఈ ఆసనం వల్ల వెన్నెముక బలోపేతం అవుతుంది. శ్వాసకోశాల పనితీరు పెరుగుతుంది.