బౌన్సింగ్ బాల్!
ABN , First Publish Date - 2020-08-31T05:30:00+05:30 IST
బౌన్సింగ్ బాల్ చేయండి ఇలా...
కావలసినవి
- బొరాక్స్ పొడి
- గోరువెచ్చని నీళ్లు
- మొక్కజొన్న పిండి
- జిగురు
- కప్పులు
- ఫుడ్ కలర్
ఇలా చేయండి...
- ఒక కప్పులో గోరువెచ్చని నీళ్లు పోయాలి. అందులో ఒక టేబుల్ స్పూన్ బొరాక్స్ పౌడర్ వేసి కరిగించాలి.
- రెండో కప్పును తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ జిగురు, మూడు చుక్కల ఫుడ్ కలర్ వేయాలి. ఈ మిశ్రమానికి కరిగించిన బొరాక్స్ పొడి, మొక్కజొన్న పిండి ఒక టేబుల్ స్పూన్ కలపాలి.
- కాసేపు పక్కన పెట్టుకోవాలి. పాకంలా అయ్యాక బయటకు తీసి చేతితో బంతిలా గుండ్రంగా తయారుచేయాలి.
- కాస్త జిగటగా ఉండి అతుక్కుంటున్నట్టుగా ఉంటే ఎక్కువ సేపు చేత్తో అదమాలి. అంతే... బౌన్సింగ్ బౌల్ రెడీ.