అమ్మ ప్రేమ

ABN , First Publish Date - 2020-12-17T07:04:57+05:30 IST

ఆకాశాన్ని అడిగితే చెప్పింది అమ్మ ప్రేమ నాకంటే విశాలమైనదని...

అమ్మ ప్రేమ

ఆకాశాన్ని అడిగితే చెప్పింది

అమ్మ ప్రేమ నాకంటే విశాలమైనదని...

సాగరాన్ని అడిగితే చెప్పింది

అమ్మ మనసు నాకంటే లోతైనదని...

కొండ తేనెని అడిగితే చెప్పింది

అమ్మ మమత నాకంటే మధురమైనదని

కొవ్వొత్తిని అడిగితే చెప్పింది

తల్లిత్యాగం తనకంటే కోటి రెట్లు గొప్పదని...


పంపినవారు

బి.ప్రవల్లిక

తిరువూరు, కృష్ణా జిల్లా


Updated Date - 2020-12-17T07:04:57+05:30 IST