శ్లోకాలంటే ఆ చిన్నారికి ప్రీతి!

ABN , First Publish Date - 2020-11-07T05:30:00+05:30 IST

పిల్లల పట్ల కొంచెం శ్రద్ధ చూపిస్తే ఏదైనా ఇట్టే నేర్చేసుకుంటారు. ఇందుకు మంచి ఉదాహరణ నంద్యాలకు చెందిన లక్ష్మీప్రీతి...

శ్లోకాలంటే ఆ చిన్నారికి ప్రీతి!

పిల్లల పట్ల కొంచెం శ్రద్ధ చూపిస్తే ఏదైనా ఇట్టే నేర్చేసుకుంటారు. ఇందుకు మంచి ఉదాహరణ నంద్యాలకు చెందిన లక్ష్మీప్రీతి. తొమ్మిదేళ్ల వయసులోనే భక్తి గీతాలు, భగవద్గీత శ్లోకాలను అనర్గళంగా చదువుతూ అందరి మన్ననలు అందుకుంటోంది ఈ చిన్నారి.


  1. నారాయణ స్తోత్రం, నారాయణ తీర్థం, కామధేను శ్లోకం, నామ రామాయణం, భగవద్గీత ధ్యాన శ్లోకాలను లక్ష్మీప్రీతి గుక్కతిప్పుకోకుండా చదివేస్తుంది.
  2. సంకట నాశన గణపతి స్తోత్రం, పంచాయుధ స్తోత్రం, లింగాష్టకమ్‌, లక్ష్మీదేవి హారతి పాటలు, భజనలు...ఇలా రకరకాల భక్తి శ్లోకాలను చక్కగా పఠిస్తుంది.
  3. తన అద్భుతమైన ప్రతిభతో ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లోనూ స్థానం సంపాదించుకుంది. భవిష్యత్తులో ఇలాంటి మరెన్నో అద్భుతాలు సాధించాలని మనమూ కోరుకుందామా!

Updated Date - 2020-11-07T05:30:00+05:30 IST