ప్రెగ్నెన్సీ యోగా

ABN , First Publish Date - 2020-12-03T16:36:16+05:30 IST

గర్భం దాల్చిన తరువాత మహిళల శరీరంలో చాలా మార్పులు వస్తాయి. దాంతో శారీరకంగా, మానసికంగా కొన్ని సమస్యలు మొదలవుతాయి. ఆ సమస్యల నుంచి బయటపడేందుకు, ఈత కొట్టడంతో పాటు

ప్రెగ్నెన్సీ యోగా

ఆంధ్రజ్యోతి(03-12-2020)

గర్భం దాల్చిన తరువాత మహిళల శరీరంలో చాలా మార్పులు వస్తాయి. దాంతో శారీరకంగా, మానసికంగా కొన్ని సమస్యలు మొదలవుతాయి. ఆ సమస్యల నుంచి బయటపడేందుకు, ఈత కొట్టడంతో పాటు యోగా చేయడం అలవాటుగా మార్చుకోవాలి. ఈమధ్యే ప్రెగ్నెంట్‌ అయిన బాలీవుడ్‌ నటి అనుష్కా శర్మ భర్త విరాట్‌ కోహ్లీ సాయంతో  శీర్షాసనం వేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రెగ్నెన్సీ సమయంలో యోగా సాధనపై మరికొందరు సెలబ్రిటీలు ఏమంటున్నారంటే.... 


‘‘యోగా నా జీవితంలో ఒక భాగం. ప్రెగ్నెన్సీకి ముందు నుంచి నేను చేస్తున్న యోగాసనాల్లో కొన్నింటిని ఏ భయం లేకుండా చేయవవచ్చని నా డాక్టర్‌ చెప్పారు. అయితే ఎవరైనా తోడుగా ఉన్నప్పుడే చేయాలని సూచించారు. నేను చాలా రోజుల నుంచి శీర్షాసనం వేస్తున్నాను. గర్భం దాల్చడంతో నా భర్త సహాయంతో, నా యోగా శిక్షకురాలు ఈఫా శ్రోఫ్‌ సమక్షంలో నేను శీర్షాసనం వేసాను. బిడ్డకు జన్మనిచ్చేంత వరకూ నేను యోగాసనాలు చేయాలనుకుంటున్నా’’ అని చెబుతున్నారు అనుష్క. 


అయితే గర్భంతో ఉన్నప్పుడు యోగా చేసిన మరికొందరు సెలబ్రిటీలు ఏమంటున్నారంటే..

ఫిట్‌నెస్‌ మీద ఎక్కువగా దృష్టి పెట్టే సోహా ఆలీ ఖాన్‌ ప్రెగ్నెన్సీ సమయంలో రోజూలానే యోగా చేసేవారు. అయితే ట్రైనర్‌ సలహాలతో అవసరమైన మార్పులతో వారియర్‌ పోజ్‌ వంటివి సాధన చేసేవారు సోహా. 2012లో మొదటి సారి తల్లి అయిన లారాదత్తా గర్భంతో ఉన్నప్పుడు యోగా చేయడమే కాదు తన యోగ వల్ల కలిగే లాభాలను వివరిస్తూ వీడియో కూడా విడుదల చేశారు. ఒకప్పుడు టెన్ని్‌సలో సంచలనం అయిన సానియా మిర్జా  ప్రెగ్నెన్సీ సమయంలో యోగాతోనే తాను అంత ఫిట్‌గా ఉన్నానని పలు సందర్భాల్లో చెప్పారు. గర్భస్థ సమస్యల నుంచి ఉపశమనం పొందడం కోసంమనసుకు, శరీరానికి సాంత్వన చేకూర్చే యోగాసనాలు,  కాబోయే తల్లులు గర్భం దాల్చిన తరువాత తేలికైన యోగాసనాలు చేయాలని సెలబ్రిటీలు సూచిస్తున్నారు. 

Updated Date - 2020-12-03T16:36:16+05:30 IST