అమ్మాయిలూ... ఇవి తింటున్నారా?

ABN , First Publish Date - 2020-11-25T17:51:45+05:30 IST

మగవారితో పోలిస్తే మహిళలకు ప్రత్యేకమైన ఆహారం అవసరం. వారి శరీర పనితీరు సక్రమంగా సాగాలంటే కచ్చితంగా తినాల్సిన ఆహారపదార్థాలలో కొన్ని...

అమ్మాయిలూ... ఇవి తింటున్నారా?

ఆంధ్రజ్యోతి(25-11-2020)

మగవారితో పోలిస్తే మహిళలకు ప్రత్యేకమైన ఆహారం అవసరం. వారి శరీర పనితీరు సక్రమంగా సాగాలంటే కచ్చితంగా తినాల్సిన ఆహారపదార్థాలలో కొన్ని... 


పాలకూర

దీన్ని చూడగానే ముఖం అదోలా పెడతారు కానీ... స్త్రీలకు పాలకూర తినాల్సిన అవసరం చాలా ఉంది. ఇందులోని మెగ్నీషియం... పీఎమ్‌ఎస్‌ (ప్రీ మెన్‌స్ట్రుల్‌ సిండ్రోమ్‌) లక్షణాలను అడ్డుకుంటుంది. అలాగే ఎముకల పటుత్వానికి, ఆస్తమా రాకుండా ఉండేందుకు, రక్తపోటును నియంత్రించేందుకు కూడా పాలకూరలోని పోషకాలు ఉపకరిస్తాయి. 


అవిసె గింజలు

మార్కెట్లో తక్కువ ధరకే దొరుకు తాయి అవిసెగింజలు. గుండెకు చాలా మంచిది. ఇందులో ఒమెగా 3 ఫాటీ ఆమ్లాలు పుష్కలం. అలాగే వాపును, నొప్పిని తగ్గించే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కూడా కలిగి ఉంటాయి. రోజూ వీటిని తినడం స్త్రీలకు చాలా మంచిది. మలబద్ధకం సమస్య నుంచి కూడా ఇవి బయటపడేస్తాయి. 


క్రాన్‌బెర్రీస్‌ 

ఎర్రటి చిన్న పండ్లు క్రాన్‌బెర్రీస్‌. మహిళల్లో తరచూ వచ్చే యూరినరీ ట్రాక్‌ ఇన్ఫెక్షన్‌ను ఇవి అరికడతాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కూడా పుష్కలంగా ఉంటాయి. 


టొమాటో

టోమాటోని చిన్నచూపు చూడకండి. ఇది ఎంతో శక్తివంతమైన పండు. ఇందులోని లైకోపీన్‌ అనే పిగ్మెంట్‌ బ్రెస్ట్‌ క్యాన్సర్‌, గుండె జబ్బులు రాకుండా సమర్థవంతంగా అడ్డుకుంటుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. 


ఓట్స్‌

‘ప్రీమెన్‌స్ట్రుల్‌ సిండ్రోమ్‌’ వల్ల కలిగే భావోద్వేగాలను నియంత్రిస్తాయి. గుండెకు మేలు చేయడంతో పాటూ జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఓట్స్‌ ఎంత తిన్నా లావెక్కుతారన్న భయం ఉండదు. కాబట్టి రోజూ తినొచ్చు. పైగా బరువు కూడా అదుపులో ఉంటుంది.

Read more