వీటితో బరువు తగ్గుతారు!
ABN , First Publish Date - 2020-10-24T06:05:05+05:30 IST
బరువు తగ్గాలనే ప్రయత్నంలో ఉన్నవారు బ్రేక్‌ఫాస్ట్ మీద దృష్టిపెట్టాలి. కొందరు బ్రేక్‌ఫాస్ట్ మానేస్తుంటారు. అయితే ఉదయాన్నే తీసుకొనే మొదటి ఆహారాన్ని స్కిప్ చేయడం వల్ల జీవక్రియలు నెమ్మదిస్తాయి...

బరువు తగ్గాలనే ప్రయత్నంలో ఉన్నవారు బ్రేక్‌ఫాస్ట్ మీద దృష్టిపెట్టాలి. కొందరు బ్రేక్‌ఫాస్ట్ మానేస్తుంటారు. అయితే ఉదయాన్నే తీసుకొనే మొదటి ఆహారాన్ని స్కిప్ చేయడం వల్ల జీవక్రియలు నెమ్మదిస్తాయి. దాంతో బరువు తగ్గడం కష్టమవుతుంది. అందుచేత బ్రేక్‌ఫాస్ట్‌లో తక్కువ క్యాలరీలు, ఎక్కువ పోషకాలున్న ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి అంటున్నారు పోషకాహార నిపుణులు.
- బ్రేక్‌ఫాస్ట్‌కు ముందు రెండు గ్లాసుల వేడినీళ్లు తాగాలి. నిమ్మరసం కలిపి తాగొచ్చు కూడా. దీంతో ఒంట్లోని మలినాలు బయటకుపోతాయి. జీర్ణవ్యవస్థ శుభ్రపడుతుంది. దీంతో జీవక్రియలు మెరుగ్గా జరుగుతాయి.
- రాత్రి తిన్న ఆహారంతో వచ్చిన శక్తి ఉదయం కల్లా ఖర్చవుతుంది. అందుచేత ఉదయాన్నే అలసటగా ఉంటుంది. కాబట్టి నిద్ర లేచిన గంటలోపే బ్రేక్‌ఫాస్ట్ పూర్తిచేయాలి. దాంతో తిరిగి శక్తి వస్తుంది. జీవక్రియలు సవ్యంగా జరుగుతాయి.
- బ్రేక్‌ఫాస్ట్‌లో చక్కెరలు, క్యాలరీలు అధికంగా ఉన్న ఆహారం తీసుకోవద్దు. రోజు మొత్తంలో తీసుకొనే క్యాలరీలను (మూడు భోజన, రెండు స్నాక్స్ వేళల్లో) విభజించుకోవాలి. బ్రేక్‌ఫాస్ట్‌లో క్యాలరీలు 25 నుంచి 30 శాతం మించకూడదు.
- బ్రేక్‌ఫాస్ట్‌లో ప్రొటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవడం వల్ల అనారోగ్యకరమైన ఆహారం మీదకు మనసు మళ్లదు. అందుచేత బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్లు, యోగర్ట్, నట్స్ వంటివి ఉండేలా చూసుకోవాలి.
- పీచుపదార్థం మంచి బ్యాక్టీరియా వృద్ధికి సాయపడుతుంది. అంతేకాదు ఆకలిని తగ్గించి, కొవ్వు చేరకుండా చూస్తుంది. కూరగాయలు, పండ్లు తినడం ద్వారా తక్కువ క్యాలరీలు, ఎక్కువ పోషకాలు అందుతాయి. దాంతో బరవు తగ్గడం తేలికవుతుంది.