ఒత్తిడి తగ్గించుకోండిలా..!

ABN , First Publish Date - 2020-05-25T05:03:58+05:30 IST

వజ్రాసనం: కాళ్లను పూర్తిగా మడిచి, ఈ చిత్రంలో చూపించినట్టు కూర్చోండి. మోకాళ్లు, పాదాలు ఒకదానికి ఒకటి ఆనించాలి. మీ అరికాలు పైకి ఉండాలి. ఇప్పుడు కుడి మునివేళ్లను ఎడమ మునివేళ్లపై పెట్టాలి.

ఒత్తిడి తగ్గించుకోండిలా..!

కరోనాతో ఎటూ కదలకుండా ఇంట్లోనే ఉండడం వల్ల రకరకాల ఆందోళనలు ఆవహించి, ఒత్తిడి సర్వసాధారణమైపోయింది. సులువైన ఈ యోగాసనాలు చేస్తే ఆ ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చు. శ్వాస ప్రక్రియ కూడా సవ్యంగా సాగాడానికి ఇవి ఉపయోగపడతాయి.


వజ్రాసనం: కాళ్లను పూర్తిగా మడిచి, ఈ చిత్రంలో చూపించినట్టు కూర్చోండి. మోకాళ్లు, పాదాలు ఒకదానికి ఒకటి ఆనించాలి. మీ అరికాలు పైకి ఉండాలి. ఇప్పుడు కుడి మునివేళ్లను ఎడమ మునివేళ్లపై పెట్టాలి. అంటే మీ కాళ్లపై మీరు కూర్చోవాలన్నమాట! మోకాళ్లపై బరువు మోపకూడదు. నడుము పై భాగాన్ని నిటారుగా ఉంచాలి. నెమ్మదిగా శ్వాస తీసుకొంటూ, వదులుతూ ఈ భంగిమలో 10 నిమిషాలు కూర్చోండి.


పద్మాసనం: కాళ్లు జాపుకొని కూర్చోండి. వెన్నుపూస నిటారుగా, చూపు నేరుగా ఉండాలి. ఇప్పుడు నెమ్మదిగా కుడికాలు మడిచి, పాదాన్ని ఎడమ తొడపై పెట్టండి. అరికాలు... పైకి ఉండాలి. మడమ పొత్తికడుపును తాకాలి. ఇలాగే ఎడమ కాలి పాదాన్ని కూడా కుడి తొడపైకి తీసుకురండి. ఇప్పుడు చేతుల్ని మోకాళ్లపై పెట్టి, రెండు మూడు నిమిషాల పాటు శ్వాస తీసుకొని వదులుతూ ఉండుండి. 


(గమనిక: ఒకవేళ చీలమండ, మోకాళ్ల నొప్పులున్నా, స్పైనల్‌ కార్డ్‌ గాయాలైనా, అల్సర్లు, హెర్నియా వంటి సమస్యలున్నా ఈ ఆసనాలు చేయవద్దు.)

Updated Date - 2020-05-25T05:03:58+05:30 IST