-
-
Home » Navya » Health Tips » Physical exercise for relieving mental stress
-
ఇలా చేస్తే ఒత్తిడి మాయం!
ABN , First Publish Date - 2020-12-06T05:45:24+05:30 IST
ఇంటి వద్దనే సులువైన పైలేట్ వ్యాయామంతో ఫిట్‌గా మారవచ్చు. వెన్నెముకనే దృఢంగా చేయడంతో పాటు ఒత్తిడిని తగ్గించే ఈ వర్కవుట్ ఎలా చేయాలంటే...

ఇంటి వద్దనే సులువైన పైలేట్ వ్యాయామంతో ఫిట్‌గా మారవచ్చు. వెన్నెముకనే దృఢంగా చేయడంతో పాటు ఒత్తిడిని తగ్గించే ఈ వర్కవుట్ ఎలా చేయాలంటే....
చెస్ట్ లిఫ్ట్: ఈ వ్యాయామాన్ని సరిగ్గా చేస్తే మెడ, వెన్ననొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఛాతి కండరాలు, పొట్ట, తుంటి పటిష్టానికి తోడ్పడుతుంది.
నేలపై వెల్లకిలా పడుకోవాలి. మోకాళ్లను వంచాలి. సపోర్ట్ కోసం రెండు చేతులను తల కింద పెట్టాలి. ఇప్పుడు మెకాళ్లపై శరీర బరువును నిలిపి, పైకి లేవాలి. ఇలా 30 సార్లు చేయాలి.
క్రిస్ క్రాస్ పైలేట్స్: దీంతో పక్క కండరాలు బలోపేతం అవుతాయి. నిటారుగా నిలబడతారు. బ్యాలెన్సింగ్ తేలికవుతుంది. భుజకండరాలకు కూడా ఇది మంచి వ్యాయామం.
వెల్లకిలా పడుకొని చేతులను తలకింద పెట్టాలి. ఇప్పుడు మోకాళ్లను ఛాతికి దగ్గరగా తేవాలి. అలానే ఎడమ భుజాన్ని కుడి మోకాలికి దగ్గరగా తేవాలి. తరువాత కుడి భుజాన్ని ఎడమ మోకాలికి దగ్గరగా తీసుకురావాలి. ఇలా 15 సార్లు చే యాలి.