ఇవి తింటున్నారా!

ABN , First Publish Date - 2020-12-26T05:44:27+05:30 IST

చలికాలంలో తప్పనిసరిగా కొన్ని రకాల పండ్లు, కూరగాయలు తినాలి. చర్మం, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు అవి ఎంతో తోడ్పడతాయి...

ఇవి తింటున్నారా!

చలికాలంలో తప్పనిసరిగా కొన్ని రకాల పండ్లు, కూరగాయలు తినాలి. చర్మం, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు అవి ఎంతో తోడ్పడతాయి.


  1. చలికాలంలో చర్మ రంధ్రాలు పెద్దవవుతుంటాయి. ఈ కాలంలో దానిమ్మ గింజలు తిన్నా లేదా జ్యూస్‌ తాగినా   చర్మ రంధ్రాలు వెడల్పు కావు. చర్మం బిగుతుగా ఉంటుంది.  
  2. విటమిస్‌ సి మెండుగా ఉండే కివి పండు చర్మానికి  మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. 
  3. చలికాలంలో క్యారట్‌ తింటే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. సూర్యకిరణాలలోని అతినీలలోహిత కిరణాల నుంచి కూడా క్యారట్‌ చర్మాన్ని కాపాడుతుంది.
  4. ఖర్జూరాల్లో పీచు, విటమిన్‌ ఎ ఎక్కువగా ఉంటుంది. వీటిని తింటే కంటి చూపు మెరుగవుతుంది. జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది.
  5. చిలకడదుంప మాయుశ్చరైజర్‌గా పనిచేసి చర్మానికి మెరుపును ఇస్తుంది.
  6. పాలకూరలోని పోషకాలు ఒంటిని, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
  7. ఈ సీజన్‌లో కాన్‌బెర్రీస్‌ తింటే శరీరంలోని చెడుకొవ్వు తగ్గుతుంది. 
  8. అరటిపండు చర్మానికి పోషణనిచ్చి, కాంతులీనేలా చేస్తుంది.
  9. బొప్పాయి కూడా ఈ సీజన్‌లో తినదగ్గ పండు. ఇది మృతకణాలను వదలగొట్టి, చర్మానికి నిగారింపునిస్తుంది.  
  10. ఈ సీజన్‌లో బ్రొకోలి తింటే చర్మం తొందరగా పొడిబారదు. చర్మంపై ఉండే పొరల్లాంటి మచ్చలు తగ్గిపోతాయి.

Updated Date - 2020-12-26T05:44:27+05:30 IST