డీటాక్స్‌ చేద్దామా...

ABN , First Publish Date - 2020-11-25T05:30:20+05:30 IST

ఒంట్లో వ్యర్థాలు, విషపదార్థాలు పేరుకుపోయినప్పుడు నీరసంగా, బద్ధకంగా అనిపిస్తుంది. అలాంటప్పుడు కీరదోస, తులసితో తయారుచేసిన జ్యూస్‌ తాగితే ఒంట్లోని విషపదార్థాలు బయటకు వెళతాయి...

డీటాక్స్‌ చేద్దామా...

ఒంట్లో వ్యర్థాలు, విషపదార్థాలు పేరుకుపోయినప్పుడు  నీరసంగా, బద్ధకంగా అనిపిస్తుంది. అలాంటప్పుడు కీరదోస, తులసితో తయారుచేసిన జ్యూస్‌ తాగితే ఒంట్లోని విషపదార్థాలు బయటకు వెళతాయి. శరీరం సత్తువను పొందుతుంది. 


కావలసినవి:

  • కీరదోసకాయలు- రెండు
  • తులసి ఆకులు- 10 లేదా 12
  • తేనె లేదా నిమ్మరసం- రెండు టేబుల్‌ స్పూన్లు
  • దాల్చిన చెక్క పొడి- చిటికెడు
  • సగం గ్లాసు నీళ్లు

తయారీ విధానం:

ముందుగా కీరదోస పొట్టు తీసి, ముక్కలుగా కోయాలి. వీటిలో తులసి ఆకులు, నీళ్లు, దాల్చిన చెక్క పొడి వేసి మిక్సీ పట్టుకోవాలి. జ్యూస్‌ తయారయ్యాక తేనె లేదా నిమ్మరసం కలిపి తాగాలి.

Read more