నెలాఖరులోగా జైడస్‌ క్యాడిలా ప్రయోగాలు

ABN , First Publish Date - 2020-07-08T06:51:34+05:30 IST

కరోనా వ్యాక్సిన్‌ తయారీ రేసులో భారత ఫార్మా కంపెనీలు దూసుకుపోతున్నాయి. జైడస్‌ క్యాడిలా గ్రూపు తాము అభివృద్ధిచేసిన కొవిడ్‌ వ్యాక్సిన్‌ ‘జైసీఓవీ-డీ’తో జూలై నెలాఖరులోగా మొదటి, రెండో దశ ప్రయోగ పరీక్షలను...

నెలాఖరులోగా జైడస్‌ క్యాడిలా ప్రయోగాలు

న్యూఢిల్లీ, జూలై 7: కరోనా వ్యాక్సిన్‌ తయారీ రేసులో భారత ఫార్మా కంపెనీలు దూసుకుపోతున్నాయి. జైడస్‌ క్యాడిలా గ్రూపు తాము అభివృద్ధిచేసిన కొవిడ్‌ వ్యాక్సిన్‌ ‘జైసీఓవీ-డీ’తో జూలై నెలాఖరులోగా మొదటి, రెండో దశ ప్రయోగ పరీక్షలను ప్రారంభించనుంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వెయ్యి మంది వలంటీర్లపై వ్యాక్సిన్‌ను పరీక్షించనుంది. మొదటి రెండు దశలు పూర్తయ్యేందుకు మూడు నెలలు.. మూడో దశకు మరో మూడు నెలలు పట్టే అవకాశాలు ఉన్నాయని జైడస్‌ క్యాడిలా చైర్మన్‌ పంకజ్‌ పటేల్‌ తెలిపారు. 


Updated Date - 2020-07-08T06:51:34+05:30 IST