రికార్డు నెలకొల్పే ప్రయత్నంలో ప్రముఖ టీవీ ప్రజంటర్ కన్నుమూత!

ABN , First Publish Date - 2020-10-04T12:42:41+05:30 IST

స్పోర్ట్స్ న్యూట్రీషన్ కంపెనీ మ్యాక్సీమసల్ వ్యవస్థాపకుడు, టెలివిజన్ ప్రజంటర్ జెఫ్ ఐజన్‌బర్గ్ ఒక ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. బ్రిటీష్ ల్యాండ్ స్పీడ్ రికార్డు నెలకొల్పే ప్రయత్నం చేస్తుండగా ప్రమాదం చోటుచేసుకుని, జెఫ్ ఐజన్‌బర్గ్ మృతి చెందారు.

రికార్డు నెలకొల్పే ప్రయత్నంలో ప్రముఖ టీవీ ప్రజంటర్ కన్నుమూత!

లండన్: స్పోర్ట్స్ న్యూట్రీషన్ కంపెనీ మ్యాక్సీమసల్ వ్యవస్థాపకుడు, టెలివిజన్ ప్రజంటర్ జెఫ్ ఐజన్‌బర్గ్ ఒక ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. బ్రిటీష్ ల్యాండ్ స్పీడ్ రికార్డు నెలకొల్పే ప్రయత్నం చేస్తుండగా ప్రమాదం చోటుచేసుకుని, జెఫ్ ఐజన్‌బర్గ్ మృతి చెందారు. ఈ ప్రమాదం జరిగిన ప్రాంతంలోనే 2016లో జెఫ్ ఐజన్‌బర్గ్ పెద్ద ప్రమాదానికి గురయ్యారు. ఆ సమయంలో అతనికి 11 ఎముకలు విరిగిపోయాయి. మీడియాకు అందిన సమాచారం ప్రకారం జెప్ ఐజన్ బర్గ్ టీవీ ప్రజంటర్‌గా ఎంతో పేరొందారు. ఐ టీవీ కోసం స్పీడ్ ఫ్రీక్స్ అనే షో నిర్వహిస్తున్నారు. 


Updated Date - 2020-10-04T12:42:41+05:30 IST