యూవీ దొడ్డమనసు.. అర కోటి విరాళం

ABN , First Publish Date - 2020-04-06T01:19:05+05:30 IST

కరోనా వైరస్‌పై పోరాటానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏర్పాటు చేసిన 'పీఎం-కేర్స్' ఫండ్‌కు భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ రూ.50 లక్షలు విరాళంగా

యూవీ దొడ్డమనసు.. అర కోటి విరాళం

ముంబై: కరోనా వైరస్‌పై పోరాటానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏర్పాటు చేసిన 'పీఎం-కేర్స్' ఫండ్‌కు భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ రూ.50 లక్షలు విరాళంగా ప్రకటించారు. కరోనా మహమ్మారితో  కమ్ముకుంటున్న చీకట్లను తరిమికొట్టేందుకు ఆదివారం రాత్రి 9 గంటల నుంచి తొమ్మిది నిమిషాల పాటు దేశవ్యాప్తంగా దీపాలు, కొవ్వొత్తులు వెలిగించాలంటూ ప్రధాని పిలుపును ప్రజలంతా పాటించాలని కూడా యువరాజ్ సింగ్ ఓ ట్వీట్‌లో కోరారు.


'మనం కలిసికట్టుగా ఉన్నప్పుడు చాలా బలంగా ఉంటాం. ఆదివారం రాత్రి 9 గంటల నుంచి 9 నిమిషాల పాటు నేను దీపాలు వెలిగిస్తాను. మీరు సైతం నాతో ఉంటారా? అందరూ సంఘీభావం తెలిపే ఈ మహత్తరమైన రోజు నేను పీఎం కేర్స్ ఫండ్‌కు రూ.50 లక్షలు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాను. మీరు కూడా మీ వంతు సహకరించండి' అని యువరాజ్ సింగ్ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.

Updated Date - 2020-04-06T01:19:05+05:30 IST