కరోనా అని తెలిసి.. కుటుంబంతో సహా పరారీ యత్నం!

ABN , First Publish Date - 2020-06-22T00:52:36+05:30 IST

ప్రపంచం మొత్తాన్నీ కరోనా మహమ్మారి వణికిస్తోంది. తుమ్మొచ్చినా, దగ్గొచ్చినా వెంటనే కరోనా పరీక్షలు చేయించుకుంటున్నారు ప్రజలు.

కరోనా అని తెలిసి.. కుటుంబంతో సహా పరారీ యత్నం!

లక్నో: ప్రపంచం మొత్తాన్నీ కరోనా మహమ్మారి వణికిస్తోంది. తుమ్మొచ్చినా, దగ్గొచ్చినా వెంటనే కరోనా పరీక్షలు చేయించుకుంటున్నారు ప్రజలు. ఇలాంటి సమయంలో కరోనా వచ్చిందని తెలిసి, ఆస్పత్రికి వెళ్లకుండా కుటుంబంతోసహా పరారయ్యే ప్రయత్నం చేశాడో యువకుడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయీలో చోటుచేసుకుంది. స్థానికంగా జరుగుతున్న ఓ వివాహంలో పాల్గొనేందుకు ఢిల్లీ నుంచి వచ్చిందో కుటుంబం. ఆ కుటుంబంలోని 18ఏళ్ల యువకుడికి కరోనా వచ్చింది. ఈ విషయం తెలియగానే సదరు యువకుడు, అతని కుటుంబం హర్దోయీ నుంచి పరారయ్యే ప్రయత్నం చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు వారిపై కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నారు. వీరితో కాంటాక్ట్‌లోకి వచ్చిన దాదాపు 40 కుటుంబాలను హోంక్వారంటైన్‌లో ఉండాలని ఆదేశించారు.

Updated Date - 2020-06-22T00:52:36+05:30 IST