మతం మార్చుకోవాలంటూ యువకునిపై దాడి... 14 మందిపై కేసు నమోదు!
ABN , First Publish Date - 2020-08-11T15:45:33+05:30 IST
హరియాణాలో మత మార్పిడుల ఉదంతం చోటుచేసుకుంది. పిన్గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రిఠ్ఠ్ గ్రామంలో మతం మార్చుకోవాలంటూ ఒక వ్యక్తిపై కొంతమంది సామూహికంగా దాడి చేశారు. బాధితుని...

పున్హానా: హరియాణాలో మత మార్పిడుల ఉదంతం చోటుచేసుకుంది. పిన్గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రిఠ్ఠ్ గ్రామంలో మతం మార్చుకోవాలంటూ ఒక వ్యక్తిపై కొంతమంది సామూహికంగా దాడి చేశారు. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ ఉదంతంతో సంబంధం ఉన్న 14 మందిపై కేసు నమోదు చేశారు. పిన్గావ్ పోలీస్ స్టేషన్ ఇన్చార్జి చంద్రభాన్ మాట్లాడుతూ రిఠ్ఠ్ గ్రామానికి చెందిన పప్పు... అదే గ్రామానికి చెందిన ముంతాజ్ చాలాకాలంగా మతం మార్చుకోవాలంటూ ఒత్తిడి చేస్తున్నారని ఫిర్యాదు చేశారని తెలిపారు. దీనిని పప్పూ వ్యతిరేకించగా ప్రధాన నిందితురాలితో సహా 14 మంది అతన్ని కర్రలతో కొట్టారు. అలాగే మతం మార్చుకోకపోతే చంపేస్తామని బెదిరించారు. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు 14 మందిపై కేసు నమోదు చేశారు.