భాగ్యనగర్ ప్రజలకు యూపీ సీఎం యోగి ధన్యవాదాలు

ABN , First Publish Date - 2020-12-05T12:00:39+05:30 IST

గ్రేటర్ హైదరాబాద్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల ఫలితాలను ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రశంసించారు....

భాగ్యనగర్ ప్రజలకు యూపీ సీఎం యోగి ధన్యవాదాలు

లక్నో : గ్రేటర్ హైదరాబాద్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల ఫలితాలను ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్  ప్రశంసించారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకత్వంపై విశ్వాసం వ్యక్తం చేసినందుకు భాగ్యనగర ప్రజలకు యోగి కృతజ్ఞతలు తెలిపారు.‘‘హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ నాయకత్వం, ప్రధానమంత్రి మోదీజీ నాయకత్వంపై అపూర్వమైన విశ్వాసం వ్యక్తం చేసినందుకు భాగ్యనగర ప్రజలకు కృతజ్ఞతలు’’ అంటూ యోగి తెలిపారు. సీఎం యోగి ఎన్నికల ప్రచారం తాము హైదరాబాద్ ను భాగ్యనగర్ గా మారుస్తామని ప్రకటించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ 48 స్థానాలను కైవసం చేసుకుంది. దుబ్బాక విజయం అనంతరం జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ కమలం వికసించడంతో కమలనాథులు సంతోషం వ్యక్తం చేశారు. 

Updated Date - 2020-12-05T12:00:39+05:30 IST