కోవిడ్ ఎఫెక్ట్ : అన్ని రకాల బదిలీలను రద్దు చేసిన యోగి సర్కార్

ABN , First Publish Date - 2020-05-13T21:48:21+05:30 IST

దేశవ్యాప్తంగా కోవిడ్ -19 పంజా విసురుతున్న నేపథ్యంలో ఉద్యోగులు, అధికారుల బదిలీలపై యోగి

కోవిడ్ ఎఫెక్ట్ : అన్ని రకాల బదిలీలను రద్దు చేసిన యోగి సర్కార్

లక్నో : దేశవ్యాప్తంగా కోవిడ్ -19 పంజా విసురుతున్న నేపథ్యంలో ఉద్యోగులు, అధికారుల బదిలీలపై యోగి నేతృత్వంలోని యూపీ సర్కార్ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ నేపథ్యంలో అధికారులు, ఉద్యోగుల బదిలీలపై నిషేధం విధిస్తూ యోగి ఆదిత్య నాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్ మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.


‘‘తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకూ అన్ని రకాల బదిలీలపై నిషేధం విధిస్తున్నాం. అయితే ప్రత్యేక పరిస్థితుల్లో బదిలీలు అత్యావశ్యకమైతే మాత్రం ముఖ్యమంత్రి ముందస్తు అనుమతితో జరగాలి’’ అంటూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ముకుల్ సింఘాల్ పేరుతో ఉత్తర్వులు వెలువడ్డాయి.


ఈ ఉత్తర్వులను ఇప్పటికే అన్ని శాఖల ఉన్నతాధికారులకు చేరవేశారు. ‘బదిలీల మార్గదర్శకాలు -2018’ ప్రకారం 20201-22 సంవత్సరానికి గాను బదిలీలు చెల్లుతాయని, అయితే కోవిడ్ నేపథ్యంలో అన్ని స్థాయిల్లో ఉన్న అధికారులు, ఉద్యోగుల బదిలీలు రద్దు చేశామని ఆయన ప్రకటించారు. 


Read more