మధ్య ప్రదేశ్ రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2 లక్షలు పరిహారం : యోగి

ABN , First Publish Date - 2020-05-10T23:07:56+05:30 IST

మధ్య ప్రదేశ్‌లోని నర్సింగ్‌పూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించినవారి

మధ్య ప్రదేశ్ రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2 లక్షలు పరిహారం : యోగి

లక్నో : మధ్య ప్రదేశ్‌లోని నర్సింగ్‌పూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు రూ.2 లక్షలు చొప్పున నష్ట పరిహారం చెల్లించనున్నట్లు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ ప్రకటించారు. 


నర్సింగ్‌పూర్ జిల్లా కలెక్టర్ దీపక్ సక్సేనా తెలిపిన వివరాల ప్రకారం, ఉత్తర ప్రదేశ్ కూలీలు ప్రయాణిస్తున్న లారీ శనివారం రాత్రి మధ్య ప్రదేశ్‌లోని నర్సింగ్‌పూర్‌ సమీపంలోని పథ గ్రామం వద్ద బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు మరణించారు, 11 మంది గాయపడ్డారు. మామిడి పండ్లు రవాణా చేస్తున్న ఈ లారీలో మొత్తం 18 మంది ఉన్నారు. ఈ లారీ హైదరాబాద్ నుంచి ఆగ్రా వెళ్తోంది. 


గాయపడినవారికి చికిత్స చేయించాలని మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను యోగి ఆదిత్యనాథ్ కోరారు. చికిత్సకు అయ్యే ఖర్చులను ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. మరణించినవారి కుటుంబాలకు రూ.2 లక్షలు చొప్పున నష్ట పరిహారం చెల్లిస్తామన్నారు.


Updated Date - 2020-05-10T23:07:56+05:30 IST