ఆ ఘనత సాధించిన తొలి బీజేపీ నేత.. యోగి ఆదిత్యనాథ్ అరుదైన రికార్డు..

ABN , First Publish Date - 2020-03-15T22:52:10+05:30 IST

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అరుదైన ఘనత సాధించారు. అదేంటంటే యూపీ సీఎంగా మూడేళ్లు పూర్తిచేసుకోవడం. అదేంటి? ఓ ముఖ్యమంత్రి పదవీకాలం ఐదేళ్లు కదా.. మూడేళ్లు పూర్తి చేసుకోవడంలో ఘనతేముంది అనుకుంటున్నారా?

ఆ ఘనత సాధించిన తొలి బీజేపీ నేత.. యోగి ఆదిత్యనాథ్ అరుదైన రికార్డు..

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అరుదైన ఘనత సాధించారు. అదేంటంటే యూపీ సీఎంగా మూడేళ్లు పూర్తిచేసుకోవడం. అదేంటి? ఓ ముఖ్యమంత్రి పదవీకాలం ఐదేళ్లు కదా.. మూడేళ్లు పూర్తి చేసుకోవడంలో ఘనతేముంది అనుకుంటున్నారా? అయితే మీకు ఈ విషయం చెప్పాల్సిందే. ఉత్తరప్రదేశ్‌లో గతంలో మూడుసార్లు బీజేపీ నేత సీఎంగా ఎంపికయ్యారు. వారిలో కల్యాణ్ సింగ్, రామ్ ప్రకాశ్ గుప్తా, రాజ్‌నాథ్ సింగ్ వంటి నేతలున్నారు. కానీ వీరెవరూ పూర్తిగా కనీసం మూడేళ్లు సీఎం పదవిలో కొనసాగలేకపోయారు. 2017లో జరిగిన ఎన్నికల్లో మోదీ మేనియా కారణంగా యూపీలో 312 స్థానాల్లో బీజేపీ విజయఢంకా మోగించింది. దీంతో తిరుగులేని ఆధిపత్యంతో సీఎంగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణస్వీకారం చేశారు. ఈ క్రమంలో ఆదివారం నాటికి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి మూడేళ్లు పూర్తయ్యాయి. దీంతో ఈ ఘనత సాధించిన తొలి బీజేపీ సీఎంగా యోగి రికార్డు సృష్టించారు.

Updated Date - 2020-03-15T22:52:10+05:30 IST