కరోనా వేళ యోగా డేపై మోదీ కామెంట్స్
ABN , First Publish Date - 2020-06-19T01:28:15+05:30 IST
న్యూఢిల్లీ: ఈ నెల 21న జరగనున్న ఆరవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

న్యూఢిల్లీ: ఈ నెల 21న జరగనున్న ఆరవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బహిరంగ ప్రదేశాల్లో పెద్ద ఎత్తున జరగాల్సిన యోగా కార్యక్రమాలు ఈ సారి కరోనా కారణంగా ఇండోర్ కార్యక్రమాలకు పరిమితమయ్యాయని చెప్పారు. ఇంట్లో యోగా- కుటుంబంతో యోగా అనేది ఈ ఏడాది కాన్సెప్ట్ అని ప్రధాని చెప్పారు. ఈసారి ఇంట్లోనే కుటుంబ సభ్యులతో కలిసి యోగా చేయాలని మోదీ పిలుపునిచ్చారు.
కొన్ని సంవత్సరాలుగా యోగాకు ఆదరణ పెరగడం సంతోషాన్నిస్తోందని మోదీ చెప్పారు. యువత యోగా చేసేందుకు ముందుకు రావడం ఆహ్వానించదగ్గ విషయమని చెప్పారు. కోవిడ్ నుంచి ప్రపంచానికి విముక్తి లభించాక యోగా మరింత పాపులర్ అవుతుందన్నారు. జబ్బులు రాకుండా రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడంలో కీలక పాత్ర పోషిస్తుండటంతో యోగాకు మరింత ఆదరణ లభిస్తుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు.