పీఏం కేర్స్‌కు ఎస్ బ్యాంకు 10కోట్ల విరాళం
ABN , First Publish Date - 2020-04-06T00:11:39+05:30 IST
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌పై పోరాడేందుకు రూ.10కోట్ల విరాళం ఇస్తున్నట్లు ఎస్ బ్యాంకు ప్రకటించింది.
ముంబై: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌పై పోరాడేందుకు రూ.10కోట్ల విరాళం ఇస్తున్నట్లు ఎస్ బ్యాంకు ప్రకటించింది. ఈ మేరకు ఓ స్టేట్‌మెంట్ విడుదల చేసింది. ‘కరోనా మహమ్మారిపై అందరం కలిసి పోరాడాలన్న ప్రధానమంత్రి మోదీ పిలుపుకు మద్దతిస్తున్నాం. కరోనా కారణంగా తలెత్తే సమస్యలపై పోరాటానికి మా వంతు సాయం అందిస్తున్నాం’ అని ఎస్ బ్యాంకు పేర్కొంది. ఇప్పటికి భారత్‌లో 3,374 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో 77 మంది మృత్యువాత పడ్డారు. కాగా, ఎస్ బ్యాంకుపై మారటోరియం ఎత్తేస్తున్నట్లు మార్చి 18న రిజర్వు బ్యాంకు ప్రకటించిన విషయం తెలిసిందే.