నన్నెవరూ కలవొద్దు: మంత్రులకు ప్రజలకు తేల్చి చెప్పిన సీఎం

ABN , First Publish Date - 2020-03-22T02:24:07+05:30 IST

రేపటి రోజు పూర్తిగా నా ఇంట్లోనే ఉంటాను. ప్రజలకు, మంత్రలకు నేను విజ్ణప్తి చేస్తున్నారు. రేపు ఎవరూ నన్ను కలవడానికి రావద్దు

నన్నెవరూ కలవొద్దు: మంత్రులకు ప్రజలకు తేల్చి చెప్పిన సీఎం

బెంగళూరు: కరోనా వైరస్ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం రోజు మొత్తం తాను ఏకాంతంలో ఉండనున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప తెలిపారు. ‘జనతా కర్ఫ్యూ’లో భాగంగా ఆదివారం రోజు పూర్తిగా తన ఇంట్లోనే ఉండనున్నట్లు యడియూరప్ప తెలిపారు. కరోనా వైరస్ నివారణకు ప్రధాని మోదీ పిలుపు మేరకు రాష్ట్ర ప్రజలకు తమ వంతు సహకారాన్ని అందించాలని ఆయన పిలుపునిచ్చారు.


‘‘రేపటి రోజు పూర్తిగా నా ఇంట్లోనే ఉంటాను. ప్రజలకు, మంత్రలకు నేను విజ్ణప్తి చేస్తున్నారు. రేపు ఎవరూ నన్ను కలవడానికి రావద్దు. ప్రధాని ఇచ్చిన ఇచ్చిన పిలుపును రాష్ట్ర ప్రజలంతా పాటించి స్వచ్ఛంద నిర్బంధాన్ని పాటించండి’’ అని యడియూరప్ప తెలిపారు.

Updated Date - 2020-03-22T02:24:07+05:30 IST