సువర్ణ అధ్యయం తెచ్చినందుకు ధన్యవాదాలు మోదీ గారూ... అంటూ యశ్వంత్ సిన్హా ట్వీట్
ABN , First Publish Date - 2020-06-01T20:44:42+05:30 IST
మోదీ -2.0 మొదటి సంవత్సరంలో ఆర్థిక వృద్ధి రేటు గణనీయంగా క్షీణించిందని, ఆ క్షీణత ప్రభుత్వ తప్పువల్ల కాదని,
న్యూఢిల్లీ : కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా ప్రధాని మోదీపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ సోమవారం ట్వీట్ చేశారు. భారత ప్రజాస్వామ్యంలోనే సువర్ణాధ్యాయాన్ని తెచ్చారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
‘‘శుభాకాంక్షలు ప్రధాని మోదీ గారూ... భారత ప్రజాస్వామ్యంలోకి సువర్ణాధ్యాయం తెచ్చినందుకు. కోవిడ్ కేసుల విషయంలో ప్రపంచంలోనే భారత్ అగ్రస్థానానికి వెళుతుంది. ఆర్థిక వ్యవస్థా కుప్పకూలుతుంది. వచ్చే ఏడాది దేశ పరిస్థితి మరింత అద్భుతంగా మారే అవకాశం ఉంది’’ అని ట్వీట్ చేశారు.
మోదీ -2.0 మొదటి సంవత్సరంలో ఆర్థిక వృద్ధి రేటు గణనీయంగా క్షీణించిందని, ఆ క్షీణత ప్రభుత్వ తప్పువల్ల కాదని, మాజీ ప్రధాని నెహ్రూ వల్లనే అని ఆయన ఎద్దేవా చేశారు. నెహ్రూ గనక 1947 నుంచి 1964 వరకూ దేశాన్ని పాలించకపోతే దేశం రెండంకెల వృద్ధి రేటును సాధించేదని ఎద్దేవా చేస్తూ యశ్వంత్ ట్వీట్ చేశారు.