మెరుపు ధర్నాకు దిగిన కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా

ABN , First Publish Date - 2020-05-19T01:17:04+05:30 IST

కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా ఢిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద సోమవారం మెరుపు ధర్నాకు దిగారు. లాక్‌డౌన్

మెరుపు ధర్నాకు దిగిన కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా

న్యూఢిల్లీ : కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా ఢిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద సోమవారం మెరుపు ధర్నాకు దిగారు. లాక్‌డౌన్ నేపథ్యంలో వలస కూలీలను స్వస్థలాలకు చేర్చే విషయంలో కేంద్ర బలగాలను రంగంలోకి దించాలని డిమాండ్ చేస్తూ ఆయన మెరుపు ధర్నాకు దిగారు. అటు మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక ప్రభుత్వాలు వలస కూలీల విషయంలో ఘోరంగా విఫలం చెందాయని విమర్శించారు. నానా అవస్థలు పడుతూ, వలస కార్మికులు రోడ్లపై నడుస్తున్నారని యశ్వంత్ సిన్హా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 

Updated Date - 2020-05-19T01:17:04+05:30 IST